అద్వైతపు అవాస్తవికత

అనేక స్థాయిలలో స్పష్టంగా, సమూలంగా మరియు ఆచరణాత్మకంగా అగోచరమైనదిగా మరియు తత్వపరంగా సరిపడనిదిగా లోపం కలిగిన దేవుని స్వభావానికి ఒక కచ్చితమైన ఆధ్యాత్మిక నిర్మాణాన్ని వివరించడం కన్నా ముగ్గురు సన్నిహిత స్నేహం కల సిపాయిలను “అందరి కోసం ఒక్కడు మరియు ఒక్కడి కోసం అందరు” అని వర్ణించినట్లు ఒక పాత నానుడి “సర్వమేదైవం, దైవమే సర్వం” అనే దానిని వర్ణించడం మరింత తీవ్రంగా అనిపిస్తుంది.

మొట్టమొదటగా అనంతరూపియైన దేవుడు అనంత రూపిగా కాక తన తత్వ స్వభావానికి విరుద్ధంగా పరిమిత రూపిగా విభజించబడి మార్చబడి వ్యక్తీకరించబడటం ఎలా సాధ్యం? ఇంకా దేవుని గురించిన సరియైన ఉద్దేశము నుండి దూరంగా ఈ భ్రమాత్మక మూర్ఖత్వపు స్థితిలోనికి తీసుకువచ్చి మనోవైకల్యపు అనైక్యత దిశగా నడిపించింది ఏమిటి?దేవుడు అఖండుడు కాక దాని కంటే తక్కువది ఏ స్థితిని కలిగియున్నా దేవుడు తప్పనిసరిగా అఖండుడు కానివాడు అవుతాడు.

ఇదే విధంగా ఒక “సంసార” అనే ఆవృత వ్యవస్థ దిశగా మళ్ళే సంభావ్యతతో మరొకసారి ఈ పొంతనలేనిది ఎప్పటికైనా తిరిగి ఐక్యపరచబడటం ఎంత పునఃనిర్ధారించేదిగా ఉంది? దీనికితోడు ప్రస్తుత జనాభా పెరుగుదలతో ఉనికి యొక్క ఈ తాత్కాలిక మరియు భ్రమాత్మక పదార్ధ రూపాలన్నీ ఒక సమూలమైన ఐక్య స్థితిలోనికి నాశనకారులుగా పయనిస్తున్నాయనడానికి ఋజువేముంది?

అద్వైత వాదానికి ఉన్న మరొక సందేహం ఏంటంటే దేవుని గురించిన సమూలమైన లేదా కచ్చితమైన భావన అనేది దేవుడు నీతికి అతీతుడు అయినా కనికరము కలవాడు, దేవుడుగా నీతియుక్తమైన జీవులుగా తన కార్యకలపాలను నిర్వర్తిస్తాడు అన్నట్టుగా వ్యక్తీకరించబడింది. ఇక్కడ కూడా ఈ అధిక స్థాయిలోని నీతిబాహ్య తత్వము నిమ్న స్థాయిలోని నీతి తత్వముగా ఎలా తనను తాను యిమిడ్చుకోగలుగుతుంది? అయినప్పటికీ హిందువులు ఇతరుల పట్ల ఉపకార భావనను కలిగి నడుచుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు, ఇది వారి అంతిమ నీతిబాహ్య తత్వానికి చేరుకోవడానికి భిన్నంగా ఉన్నట్లు ఇట్టే అర్థమవుతుంది. తప్పనిసరిగా వారి అద్వైత వాదం కాదు కానీ వారి క్రియలే నీతిబాహ్యత ప్రతిరూపంతో పోల్చినప్పుడు సంస్కృతి, నాగరికత మరియు సమాజపు మనుగడకు దోహదపడుతున్నాయి కావున విస్తారంగా వారి పరోపకార క్రియలే విలువైనవిగా వెల్లడిచేస్తున్నాయి. కావున నిర్వాణ లేదా మోక్షానికి చేరుకోవడానికి వారి సిద్ధాంతాన్ని ఒక మెట్టుగా స్థానం కల్పించడానికి మరియు వారి దైనందిన జీవితాన్ని ఎలా విలువనిచ్చి కొనసాగిస్తున్నారు అన్నదానికి పొంతనే లేదు. అంతేకాక ఈ నైతిక భేదాలు భ్రమాత్మకంగా మరియు మిధ్యాపరంగా అర్థరహితంగా ఉంటూ చివరకు వచ్చేసరికి ఏదో ఒక రకంగా వీరి పరోపకార క్రియలను అర్థవంతంగా లేదా నిరూపితాలుగా ఎంతవరకు చేయగలవు? ఇది సత్యదూరంగా ఉంటూ ఒక కనికట్టులా అనిపించడం లేదా? వాస్తవానికి అద్వైతవాదుల నమ్మకం ప్రకారం అడాల్ఫ్ హిట్లర్ చేసిన పనులను మరియు మదర్ థెరీసా చేసిన పనులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారిద్దరి పనుల మధ్య వాస్తవానికి తేడా ఏమీలేదు కావున. అలా వేరుగా చూస్తే దేవుడిని కించపరిచినట్లవుతుంది. నైతికంగా భంగపాటుకు లోనవుతూ ఏ అద్వైతవాది అలా ఊరక నిల్చుని నైతిక విలువలకు వెలుపల ఉండగలడు? ఇది తప్పు నుండి ఒప్పును వేరుపరుస్తున్నట్టుగా సార్వత్రిక న్యాయ వ్యవస్థ యొక్క వాస్తవికత వైపుగా ఇది మరలా ఒక నిబంధన అవుతుంది. ఒక స్నేహితుడు బహుమానము ఇవ్వడానికి మరియు ఆ బహుమానాన్ని ఒక దొంగ ఆ బహుమానాన్ని దొంగిలించడానికి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు అనడం పూర్తిగా అసత్యము మరియు అబద్ధము అవుతుంది. నైతిక సరిహద్దులు లేకుండా పరిపాలించబడే ఒక ప్రపంచాన్నిమరియు సమాజాన్ని మరియు అటువంటి అరాచక న్యాయరహిత స్థితిలో మీరు జీవించాల్సి రావడాన్ని మీరు ఊహించగలరా? వారు ఎప్పటికీ బయటపడలేని మరియు బయటపడకూడని ఒకదాని వలె మరియు హైందవ నమ్మకాల ప్రకారం తప్పు మరియు ఒప్పు/మంచి మరియు చెడుల యొక్క సార్వత్రిక సూత్రాలను భంగపరుస్తున్నవిగా అనైతికత యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడంలో నైతిక విలువలు ప్రాముఖ్యంగా సంబంధాన్ని కలిగి ఉంటాయని చూపించే ప్రాయశ్చిత్తము యొక్క్ కర్మా బలాలలో విశ్వాసముంచేటట్లుగా మరణ సమాధులను మించి మనుగడ కొనసాగించే సామాజిక ఒప్పుదల కొరకు నైతిక ప్రమాణాలను కలిగియుండటంలో వాస్తవమైనది మరియు ప్రాముఖ్యమైనది ఒకటుందని స్వభావసిద్ధంగానే ఒక అద్వైత వాదికి అర్థమవుతుంది. చివరగా ఈ సందర్భంలో హిందువులు అనైతికమైన వారని నేను అనడం లేదు కానీ ఒకవేళ వారు నమ్మే ఆ ప్రవర్తనే తప్పనిసరిగా అవాస్తవమై లేదా భ్రమాత్మకం అయితే దానికనుగుణంగా స్పందించడానికి మరియు అంతమ గమ్యానికి ఇదే ఒక తప్పనిసరి మార్గం అని చెప్పడానికి వారికొక ధృఢమైన ఆధారం లేదు. ఇది వారి జీవన విధానం ద్వారా తప్పుగా వ్యక్తీకరించబడింది. చివరిగా దేవుడు నీతిబాహ్యమైన వాడుగా ఒక వెర్రి అసాంఘీక వ్యక్తితో సమానంగా వ్యక్తపరచబడటం అవుతుంది.

మరొక విషయమేమిటంటే అద్వైత వాది A మరియు A కానిది రెండూ సమాన వాస్తవాలు కానీ వారి దైనందిన జీవితాలు మాత్రం ఈ నమ్మక వ్యవస్థతో అంగీకరించవు మరియు వాస్తవికత మరియు భ్రమల మధ్య వైవిధ్యం ఆధారంగా సత్యం మరియు అసత్యము ఏమిటి అనే ద్వైత సిద్ధాంతానికి మద్దతిచ్చే వారి అద్వైత సిద్ధాంతముతో కూడా వారి జీవిత విధానము సరిపోయేదిగా ఉండని కారణంతో “లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్”(అవివాద న్యాయము)హేతువును మరియు తర్కాన్ని తిరస్కరిస్తాడు. ఈ కనుగొనబడని సిద్ధాంతపు కొన్ని ఉదాహరణలలో అద్వైతవాదులు”ఒక వ్యక్తి అసలు ఉనికిని కలిగిలేడు” అనే వ్యాఖ్యలు ఉంటాయి, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి మొదటగా ఉనికిని కలిగి ఉండాల్సిందే.

ఒక కాల/ప్రదేశ నిడివిలో అసలైన అపరిమితములు ఉన్నాయని కూడా ఇది తెలుపుతుంది. ఇది కూడా కేవలం గణిత సూత్రాలలో మాత్రమే కనిపించే ఒక ఊహాభావనే. ఇంకా పరిమిత స్థితిలో దేవుడు అగోచరమైన వాడు అనే వారి వాదన తనను తానే ఓడించుకుంటూ జ్ఞానాన్ని ఒక పరిమిత జీవిగా వ్యక్తీకరిస్తూ సర్వజ్ఞాన కచ్చితమైన వ్యాఖ్యను చేస్తుంది. అదనంగా వారి స్వీయ సైద్ధాంతిక విశ్వాసల పట్ల ఒక అద్వైతవాది స్థిరంగా ఉంటే అది పరిమితమైన దానినుండి వెలువడే వారు చేసిన వ్యాఖ్యలను బట్టే వారిని సందేహములోనికి నెట్టి వేస్తుంది మరియు మనిషే దైవమై ఉంటాడనే ఆలోచనను వెలికితీసి ఎవరు తమ్మును తాము మోసపుచ్చుకోగలరు?
వారి దైనందిన జీవితాల క్రియల ద్వారా తప్పుగా నిర్ధారించబడేవిగా ఈ నమ్మకాలకు మద్దతు పలికే అసహజమైనదిగా మరియు ప్రత్యేకంగా ఒక నిర్ధారణ లేదా ప్రభావమైన వివరణ లేనిదిగా ఉంటూ ఈ పూర్తి తత్వ వ్యవస్థను ప్రాధమికంగా మరియు సాక్షాత్తూ గ్రాహ్యం కానిదని నేను బలంగా సందేహించే పరిమితులకు లోబడి మరియు మానవ గురువుల యొక్క మరియు పుస్తకాల వాటిలోని అంశాలలో ఉన్న అసత్యాలను బట్టి భ్రమాత్మక ఆలోచనకు వారు నిజంగా వారి స్వంత వ్యవస్థ యొక్క ఆలోచననే నమ్మలేరు.

ఈ భౌతిక ప్రపంచం అంతా మిధ్య అని చెప్పడానికి ఒక అద్వైత వాది వద్ద ఉన్న సాక్షాలేమిటి? సహజసిద్ధమైన వాస్తవికతు విరుద్ధంగా నిరూపించడానికి వారి వద్ద ఉన్న పరిశీలనాత్మక పద్ధతులు ఏమిటి? ఇంకా ఏ అద్వైత వాది తను రోడ్డును దాటేటప్పుడు రెండువైపులా చూసుకోకుండా వాహనాలు కేవలం వారు ఊహా రూపాలని మాత్రమే తలంచి రోడ్డును దాటగలరు? దీనిఫలితంగా ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ అయిన మ్యాట్రిక్స్ సైన్స్ ఫిక్షన్‌ను నమ్మడం కంటే భౌతిక వాస్తవికతను నమ్మడం మరింత సంభవనీయము అవుతుంది. వీటన్నిటికీ అదనంగా మనం ఒక కలలాంటి ఊహాప్రపంచంలో జీవిస్తున్నాము, ఇది నిజము కాదు కేవలం మిధ్యే అని చెప్పడము పూర్తిగా ఆలోచన రహితమైనది. ఈభ్రమలను గూర్చిన వివేచనారాహిత్యము దానిప్రతివాదాన్ని దానికంటే తక్కువగా సంభావ్యమైనదిగా మరియు నిలకడగలిగినదిగా చేయలేకపోయింది.

వారి తత్వవాదం యొక్క మరొక్క అవాస్తవమైన సంగతేంటంటే స్పృహ, చిత్తం, భావోద్వేగాలు మరియు జ్ఞానము వంటి వ్యక్తిగతాంశాలు భ్రమాత్మకమైనవి మరియు ఇవి దేవుడు సరళమైన స్వభావాన్ని గురించిన వాదనకు వ్యతిరేకమైనవి మరియు వాస్తవానికి ఒక వ్యక్తి కోమాలోకి వెళ్తేనే కానీ ఈ విధంగా ఉండటం కుదరదు. ఈవిధంగా దేవుడిని అధికంగా సరళపరచడం అనేది నేను ఇదివరకే ఇతర ఆర్టికల్స్‌లో రాసిన విధంగా రూపకల్పనలో ఉన్న సంక్లిష్టతలు, మూలాలు ఆధారంగా ఖగోళపరంగా మరియు వేదాంతపరమైన సాక్షాధారాల వెలుగులో అంతగా ఒప్పించలేకపోతుంది.

Atheist and Agnostic

ఒక రాయికో లేదా చెక్కకో దేవుడు సరిగ్గా అనుకూలమైన వాడు అని చెప్పడం ప్రాధమికంగా దేవత్వం వైపుగా శ్రేఢియొక్క జీవ పరిణామ కొలమానంపై మానవాళి ఇంకా వెనుకబడి ఉంది అని తేటతెల్లం చేస్తుంది. పునరవతారం దిశగా వెనుకకు వెళ్ళడం అంటే ఒకడు తనను తాను దేవునితో జతపరచుకోవడం అయి ఉండవచ్చు.

దళితులను నిమ్న వర్గానికి చెందిన వారుగా లెక్క కట్టే ఒక కుల వ్యవస్థతో వారి సమాజం యొక్క సభ్యుల మధ్య భేదాన్ని ఏర్పాటుచేస్తూ కొంతమంది హిందువులు ఇతరులను చూడటం కూడా ఈ మొత్తం దేవుడిని గురించిన భావనకు సంబంధించి విరుద్ధంగా ఉంటుంది. ఇంకా దేవుని యొక్క మరొక ప్రతినిధిని అగౌరవ పరచడం అంటే మనలను మనం అగౌరవపరచుకున్నట్టే.

హైందవ సమాజంలో ఉన్న మరొక విలువ ఏంటంటే “అన్ని మార్గాలు భగవంతుని వద్దకే చేర్చుతాయి” అనే విషయాన్ని ఓపికతో బోధించడమే. దీని గురించి నేను ఇదివరకే వేరొక బ్లాగ్‌లో వ్రాయడం జరిగింది మరియు కానీ ఒక హైందవ జాతీయుడు హింసాత్మకమైన మార్గంలో దూసుకొస్తున్న తత్వభావనలు మరియు మతవిశ్వాసాలపై ప్రతిస్పందించడం అనేది ఇతర విశ్వాస వ్యవస్థలపై బలవంతంగా దాడిచేసే వారి సంస్కృతికి ఒక కళంకంగా చూస్తూ ఉండటంతో వారు నిజానికి దీన్ని నమ్మరు లేదా అంగీకరించరు.

అన్ని మార్గాలు భగవంతుని వద్దకే చేర్చుతాయి

ముగింపులో అద్వైత వాదపు వాస్తవికత వైపుగా ఈ మొత్తం విశ్వాసం ఒక ఏకీకృత నిర్మాణంలోని ఒక మూస లోపల జీవితాన్నంతటినీ పట్టించడానికి ఒక సంస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నం వలె జీవన పోరాటాన్ని దాని బాధ, శ్రమ మరియు మరణములతో సహా ఏర్పాటుచేయడానికి చేస్తున్న ఒక రివర్స్ ఇంజనీరింగ్ ప్రక్రియలా కేవలం ఒక ఎండమావిలా ఉంటుంది.
అటువంటి భిన్నత్వాన్ని జీవితంలో వివరించడానికి చేసే ప్రయత్నం ఒక చదరపు పాత్రను వృత్తాకార రంధ్రములో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నము వలె ఉంటుంది కానీ అలా చేయడం సాధ్యపడదు. కావున తత్వపరంగా సరియైనది కాకుండా పురాతన కాలం నుండి ఉన్నవని అనడం అవాస్తవము. ఈ విధంగా వారిది కాని స్వభావాన్ని పైకి వ్యక్తపరిచే వారిని యేసుక్రీస్తు వేషధారులుగా ప్రస్తావించడం జరిగింది.

తిరిగి ఐక్యపరచబడతామనే ఒక స్పృహను ఇచ్చేదిగా జీవితపు విషాదాలు మరియు భేదాలతో కలసి నడవడానికి ఒక మార్గమే బహుశా ఈ అవాస్తవికత యొక్క పూర్తి విధానపు ఆలోచన. మీరు ఎంత నిజాయితీపరులైనప్పటికీ ఒకదాన్ని నమ్మడానికి లేదా ఆశించడానికి ఆ విషయానికి సంబంధించిన ఒక వాస్తవమైనదాన్నో అవాస్తవమైనదాన్నో చేయాల్సిన అవసరం లేదు.

గౌరవదాయకంగా విస్తారమైన హైందవ సమాజము వారి మతపరమైన ఆలోచనల ఆధారంగా చైతన్యం కలిగించడంలో చాలా ముందు స్థానంలో మరియు దాని సమ సమాజ సభ్యుల కృత్యముల పరంగా చూస్తే ప్రపంచంలోని అనేకమంది కుష్టురోగులను మరియు అంధులను కలిగియుండి అందుకు భిన్నంగా ఉండటాన్ని బట్టి ఇలాంటి వాడుకలు మరియు నమ్మకాలు మరింత చైతన్యవంతమైన పథములోనికి లేదా సమాజములోనికి నడిపించలేవని అర్థమవుతుంది.

చివరగా నేను జీవితానికి మరింత సంభావ్య వాస్తవికత నిర్వచనాన్ని వివరించడానికి బహుగా పరిశోధించబడి చారిత్రాత్మకంగా మరియు తత్వ పరంగా విశ్వసనీయమైనదిగా మరియు అద్దినట్టు సరిపోయే నిలకడను కలిగిన వ్యవస్థను కలిగిన ఒక బైబిల్ పరమైన ఆలోచనను నేను మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను.

శాశ్వతమైన మహనీయుడు, సర్వజ్ఞాని మరియు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మానవాళిని తన సృష్టిక్రమంలో శిఖరాగ్రంగా చేస్తూ అన్నినిజరూపాలను ప్రత్యేకంగా భౌతికమైన మరియు ఆత్మీయమైన నిజరూపాలను సృజించాడని బయలుపరుస్తూ బైబిల్ ఒక చక్కటి వివరణను అందిస్తుంది. మానవుడు దేవుని స్వరూపంలో తయారుచేయబడ్డాడు కానీ దేవునిగా కాదు. దేవుని లక్షణాలను పంచుకుంటూ నైతికతను, జ్ఞానాన్ని స్పృహగా కలిగియుండి స్వేచ్ఛను ఒక ఉచిత నైతిక కారకంగా కలిగియుండి మానవుడూ రూపొందించబడ్డాడు. కానీ ఇన్ని గొప్పలక్షణాలున్నప్పటికీ తన సృష్టికర్త పరిశుద్ధతకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి మానవాళికి మరియు దేవునికి మధ్య ఒక అంతరాన్ని ఏర్పరుస్తూ పాపభూయిష్టమైన స్వభావాన్ని అందుకున్నాడు. అయితే దీనంతటిలో ఒక మంచి వార్త ఏంటంటే సార్వభౌమాధికారపు శక్తిమంతుడుగా దేవుడు తాను వ్యక్తిగతంగా కనికరమును కలిగిన వాడుగా యేసును ఈలోకములోనికి పంపించాడు. మానవాళిని విడిపించడానికి తనను తాను అర్పిస్తూ తన విధేయత ద్వారా మానవాళిని తిరిగి దేవునితో ఐక్యపరచడానికి ఒక సంధిపరమైన విమోచనా కార్యము ద్వారా ఈ యేసు దేవుడిగా ఉండి కూడా రక్తమాంసములుగా మారి సిలువగా పిలువబడే మానవ శ్రమను అనుభవించాడు. ఈ న్యాయసమ్మతమైన కార్యము తన యందు విశ్వాసముంచే వారికి రక్షణను ఇవ్వడానికి ఒక క్రయధనముగా ఉంటూ దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచింది. దీనిద్వారా మనము క్షమించబడి దేవునితో సమాధానపరచబడి అంతిమ ఫలితమైన శాశ్వతమరణము నుండి తప్పించబడ్డాము. లేనట్లయితే ఎందరైతే మొదట మనము దేవునినుండి వేరుచేయబడటానికి కారణమైన ఆ శాపమును తొలగించివేసే ఈ కనికరముతో కూడిన త్యాగాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారో వారు ఆ శ్రమను మరియు బధను అనుభవిస్తారు. ఇది అంతా అక్షరాలు, పదాలు మరియు ఉద్దేశాల యొక్క మర్మంగా అనిపిస్తుంది కానీ మానవ మత సంబంధ స్వీయ ప్రయత్నాలు సత్క్రియలు మాత్రమే కాక కేవలం ఎందరు ఆయన నామము బట్టి పిలువబడతారో వారు తమ జీవితంలో పూర్తి విడుదలను పొందుకుని ఆ రాబోయే జీవితము మహిమయుక్తమైన పరలోకపు స్వాస్థ్యమును అనుభవిస్తుంది.

యోహను 8:36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

మత్తయి11:28-30
28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 
హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

The Illusion of Pantheism

 

 

Holman QuickSource Guide to Christian Apologetics, copyright 2006 by Doug Powell, ”Reprinted and used by permission.”

Leave a Reply