సాంప్రదాయ శుద్ధీకరణ మరియు పవిత్రత

ప్రపంచపు అనేక మత సాంప్రదాయ వాదులు ఏదో ఒక విధమైన శుద్ధీకరణ ప్రక్రియను కలిగియుంటారు. అది శిశు జననం కావచ్చు లేక మరణం కావచ్చు, అంతేకాదు వారి దైనందిన జీవితంలో విరేచనాలు, లైంగిక సంపర్కం అలాగే నెలసరి ఋతుక్రమం మరియు స్పృహతప్పుట మరియు రక్తం చిమ్ముట, ధాతువు విసర్జన సమయంలో వాంతులు వంటి వ్యాధులు సంభవించినప్పుడు శుద్ధి క్రమమును అనుసరింతురు, కొందరైతే తమ శరీరమును పూర్తిగా నీటిలో ముంచి స్నానము చేయుట ద్వారా శుద్ధి చేయబడుదురు.

యూదులైతే తమ చేతులు కడుగుకొనుట మరియు మిక్వా ద్వారా ఈ శుద్ధీకరణ అభ్యసింతురు, అదే ముస్లింలు దీనిని ఘుసి మరియు వుడు అందురు. హైదవులు పవిత్ర నదియైన గంగలో స్నానం చేయుట మరియు అచమన మరియు పుణ్యహవచనములు అభ్యసింతురు. అలాగే షింతోయులు మిసోగి మరియు స్థానిక అమెరికన్ ఇండియన్స్ వారు చెమటను కార్చుట ద్వారా శుధ్ధిని ఆచరింతురు.

వివిధ మతాలవారు వారి శుద్ధీకరణ విషయంలో తమ వ్యక్తిగత అభిప్రాయాలలో భేధములు కలిగి యున్నప్పటికీ, వీరిందరి మధ్య ఒక విధమైన సాన్నిహిత్యాన్ని చూడగలం, అదేమనగా వారి శుద్ధీకరణ నిమిత్తం వీరిలో అధిక శాతం ప్రజలు నీటిని శుద్ధీకరించే మూల కారకంగా స్వీకరిస్తారు. ఈప్రపంచములో గల ఇతర వస్తువులను తనలో ఇమిడించుకునే శక్తిని కలిగియున్న నీటిని వీరు వివిధ విధములగా వినియోగిస్తుంటారు.

ఈ విధముగా ఎవరికి వారు తమ మతాచారముల చొప్పున తమ స్వకీయ ఆలోచనలచొప్పున వారి పద్ధతులను ఏర్పరచుకొనురి. దీనిని బట్టి ఒక పురాతనమైన నానుడి, “శుద్ధుడగుట దైవత్వమునకు సాదృశ్యము” ప్రచురణలోకి వచ్చెను. ఇట్టి పరిశుద్ధత యొక్క సాంద్రత కొద్ది కాలము మాత్రమే నిలిచి ఉంటుంది, తద్వారా వారు మరలా మరలా అవసరమగుచున్నదంటే, దాని అర్ధం దీని శుద్ధీకరణ శక్తి లోపభూయిష్టమైనదని గోచరమగుచున్నది. తద్వార మనం ఆ కలుషితమును సమూలముగా శుద్ధీకరించే సామర్ధ్యం గల శక్తి యొక్క ఆవశ్యకత పూర్తిగా కనిపిస్తుంది.

నిజమే, మన భాహ్య శరీరమును కడిగి శుద్ధీకరించుట వలన, శరీరమునకు మేలు కలుగుతుందేమో గాని, అంతరంగిత విషయంలో మన బాహ్య శుద్ధి వలన ఏ విధమైన మేలు చేకూరదు. అలాగే, మన అనిత్యమైన శరీరముతో మన నిత్యమైన శరీరమును శుధ్ధీకరించజాలము. ఎందుకనగా, అనిత్యమైనది నిత్యమైన వాటిని చేరుకోజాలదు.

యేసు ప్రభువు తన యూదా మతమునకు చెందిన శిష్యులనుద్దేశించి ఇటువంటి కొన్ని ఆచారాములను బోధించాడు. మత్తయి 15:1-2,11,17-20
1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి. 11 నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదుగాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 17నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 18నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 19 దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

మనుష్యుల ఇట్టి చెడుతనము కాకుండా మరి కొన్ని తప్పిదములు మరియు దోషముల మూలంగా చేటుచేసుకొనే నీతి విషయమైన వైఫల్యముల ద్వారా వాటిని ఏవిధంగా తొలగించగలమో గుర్తించే శక్తి మరియు లోతైన సంగతులను తెలుసుకోవలసిన ఆవశ్యకత కలదు. ఇది షేక్సిపీయర్ రచించిన లేడి మెక్ పెత్ పలికిన మాటలు – మిక్కిలి చెడ్డ మచ్చ తొలగిపోవు గాక, ఎందుకనగా రాజైన డంకన్ మరణసంబంధ పాప విషయంలో తన చేతులు కడుగుకొనదలచెను.

ఈవిధమైన సాంప్రదాక పద్ధతులను నిర్వహించి తమను తాము కడుగుకొనుట ద్వారా వీరు ఒక విధముగా తమ పాపములను ఒప్పుకొనుచున్నారని తెలియుచున్నది. అంతే కాకుండా వారు తమ మానవీయ సామర్థ్యంతో, అగోచరముకాని వాటివియు మరియు నీతిని విడుచుటమాలంగా కలిగిన వైఫల్యతలపైన జయం పొందుటకు ప్రయత్నించుచున్నారు. జాగరూకత ఈవిధమైన ఆచారాలు జరిగించుటకు వీరిలో వాంఛగలదు. దైవభక్తి మరియు తీవ్రమైన కోరిక లేనివారైయుండి ఇట్టి పద్ధతుల ద్వారా తమనుతాను శుద్ధిచేసుకొనగలమని మరియు మానవీయ సామర్ధ్యంతో పశ్చాత్తాపపడుట వలన సామర్ధ్యమును తిరిగి పొందగలమని భావించుట వ్యర్థ ప్రయాసమగును. ఒకవేళ ఇట్టి చర్యల ద్వారా శుద్ధి పరచబడినప్పటికీ, హృదయమనే అంతరాత్మ మరియు మనస్సుపైన పచ్చబొట్టువలె ముద్రింపబడిన జన్మకర్మ పాపముల మరకలను మరియు ఆత్మీయ మరణము నుండి ఇట్ఠి శుద్ధీకరణ ప్రక్రియ కాపాడగలదా!

చివరిగా ప్రతి మనుష్యునిలోను అంతరిధ్రియము తెలియజేయునదేమనగా, మనం పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వం కోల్పోయియున్నామని తెలుసుకొనుచున్నాము. ఈ సమస్యను పరిష్కరించుకొనిన వారు భవిష్యత్తులో తీర్పునకు అప్పజెప్పబడుదురని తెలుసుకొనవలసియున్నది.

రోమీయులకు వ్రాసిన పత్రిక 2: 14-16
14 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు 16 దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

మానవాళి ఈవిధమైన వత్తిడిని ఎదుర్కొనుటకు తనకనుకూలమైన సామర్ లేని సిద్ధాంతాలతో కూడిన మతాచారాముల ద్వారా ఒక ప్రతిష్టాత్మక మార్గమును కనుగొనాలనే మంట రగిలించుకున్నది. అది తన ప్రయణ మార్గంలో వెలుగు ప్రధాత కాదలదని భావిస్తునప్పటికీ, మన వ్యక్తిగత కోర్కెలను విడిచిపెట్టాలనే విషయాన్ని నాస్తికత్వం పూర్తిగా నిరాకరిస్తుంది. కాబట్టి వారికి గమ్యం అంటూ ఏమి ఉండదు. ఎందుకనగా కాస్త మానసికంగా బలహీనులైన వారిని ఈమతాచారము భావుకతకు లోనగునట్లు చేసి తద్వార తాము ఆశించిన స్థానంలోకి ప్రవేశం కల్పించు కల్పిత మార్గమాయెను. ఏలైగాతేనేమి సృష్టికర్త ఆశించిన విధముగా మానవుడు తనను తాను మందిరమునందు ముంగలిగాను లేక సర్దుబాటు స్థలంగాను మలచుకొనుటలో సిద్ధహస్తుడాయెను.

ఈ విషయమును గూర్చి నేనైతే, ఒక విషయమును తెలియజేయాలని ఆశిసిస్తున్నాను, అదేమనగా, ఇతర మతముల వివరణలు తెలియజేయువిధముగా, మానవులు దేవుని వెదకుచున్నట్లుగాకుండా, దేవుని క్రియలను ఒక వ్యక్తి చేయుటవలన దేవుని వద్దకు చేరుకోగలడు, ఐతే దేవుడే మానవులతో నమ్మకమైన సత్సంబంధం కలిగియుండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈవిషయమై మానవ వ్యక్తిగత బలం మరియు బలహీనతలకు తావులేదు. ఐతే దేవునితో సహవాసం కలిగి ఆయనను ఆరాధించడం ద్వారా దేవుడు మనకు తన కృపాబాహుళ్యతలను, పరిశుద్ధతను మరియు శుద్ధీకరణలను ఉచిత బహుమానములుగా అనుగ్రహించును, అది మనవలన కలుగదు.

తీతు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా గాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

రోమీ 6:23
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఎఫిస్సీ 2:8-9
8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 9 అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

1యోహాను 1:7
7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా జేసెను.

1యోహాను 1:9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

మీరు క్రైస్తవ విశ్వాసం కూడా ఇతర మతములోవలె మతాచారముల వలె శుద్ధీకరణమను భాప్తిస్మము అను ప్రక్రియను కొనసాగించుచున్నదని వాదించవచ్చు. ఇది మారు మన్ససు లేని విశ్వాసులను సంఘంలో ప్రవేశం కల్పించుటకు ఒక ముఖ్య స్నానంగా భావించుటలో నేను మీతో ఏకీభవిస్తాను. విశ్వాసమునకు మూలం నిజమైన బాప్తిస్మము. ఇది ప్రధమికంగా బాహ్య గుర్తు లేక చిహ్నంగా పరిగణింపబడుచున్నది. అయితే ఇది నిజము యేసుని ప్రశస్తమైన మరియు విలువైన జీవము గల రక్తముతో కడుగబడి ప్రతి విశ్వాసి ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడని రూఢిపరచుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి మార్పునకు కారకులైన ద్రవం వలన కలిగిన రక్షణ చేకూరుస్తున్నాడు. ఇదేదో కేవలం ఉపజని మరియు ప్రాణ వాయువుల కలయికలైన ద్రవం వలన కలిగిన రక్షణ కాదు గాని, దానిని పోలిన క్రీస్తుయేసుని క్రియలు మరియు జీవజలమైన పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరియు హృదయంలో మార్పు చెందుతుంది. ఇది దేవుడు కానుకగా అనుగ్రహించినది. అలాగే మానవులు లోనుండి ఒక మనుష్యుని నూతన జననం గూర్చిన సాదృశ్యంలో గల పరలోక దేవుని శక్తిని సూచిస్తుంది. ఇది మానవ ప్రయత్నం లేక మతాచారముల వలన లభించినది కాదు గాని, దేవుడు తానే స్వయంగా మానవుని రూపంలో క్రీస్తుగా జన్మించి మనలకు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మను అనుగ్రహించెను. పునర్జన్మ కేవలం క్రీస్తు యేసుని క్రియలు మరియు ఆయన పంపిన పరిశుద్ధాత్ముడు తనను వెంబడించు వారిలో రక్షణ పట్ల విశ్వాసమును మరియు నమ్మకమును రేకెత్తించుచున్నాడు.

ఇశ్రాయేలీయుల భవష్యత్తు విడుదల గూర్చిన యథార్ధతను గూర్చి హెబ్రీ ప్రవక్తయైన యోహేజ్కేలుతో దేవుడు పలికించిన ప్రవచనమనులు .

యోహేజ్కేలు 36:25-27
25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. 26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. 27 ​నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.

పర్ణశాలల పండుగ లేక సుక్కోతు విందునాడు రబ్బీ యేసు ఈవిదంగా చెప్పాడు

యోహాను 7:37-39
37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. 38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39 తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

పురాతనమైన యూదా మతస్థులు, తమ ఆచార కర్మల ద్వారా దేవుని మహిమ పరచుటవలన అశాశ్వితమైన సంతృని పొందేవారని హెబ్రీ 10వ అధ్యాయంలో ఇవి కేవలం క్రీస్తు యేసుని సిలువ పైన దేవుని గొర్రెపిల్లాగ బలియాగముగా సమర్పింపబడుట ద్వారా లోకము పాపమునుండి విడుపించు వాటికి కేవలం ఛాయ వంటివిగా పరిగణింపబడుచున్నవని వ్రాయబడియున్నది. నేడు యూదులకు ప్రాయశ్చిత్తం యొక్క అవసరం లేదని చెప్పుట మరియు వారి ప్రార్ధన ఉపవాసములు మరియు మంచి క్రియలను ఆధారములను ఆచరించుట ద్వారా వారికి విమోచనము లభించుచున్నట్టైతే వారు తొరా, లేవీకాండము 17:11 నిరర్ధకమగును.
11రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

యెషయా 53వ అధ్యాయంలో తెలుపబడిన మెస్సయా ద్వారా దేవుని కృపను మరియు కనికరములు లేకుండా మీరు ఎన్ని విధములైన ఆచార వ్యవహారములు నెరపినప్పటికీ అవి ఖచ్చితముగా మన పాపములను క్షమించిగలవని రూఢీగా చెప్పగలమా?

అలాగే చాలా మంది ఇస్లాము స్నేహితులైతే యేసుని సిలువ మరణంను గూర్చి వేరు భావము కలిగియున్నారు. నిజముగా ఈలోకంలో మెస్సయా భాధింపపడుట వలన మరియు విసర్జించబడుటటలో దేవుడు మానవాళికి గొప్ప సంతోషమును దాచియుంచెను మరియు దేవుని మహిమలోనికి అనేకులను నడిపించుటకు సిలువ ఒక కారకమాయోను. హెబ్రీ 2:9-18, 12:2

jesusandjews.com/wordpress/2011/07/14/crucifixion-of-jesus-christ-and-islam/

పరలోకమందుకున్న దేవుడు మనలను ఈ నీటి యొద్దకు నడిపించినప్పటికీ వాటిని త్రాగుటకు వీలు కల్పించబడలేదు, కావున యేసు ఈ జీవ జలములను మీకు అనుగ్రహించుచున్నాడు. దానిని త్రాగిన వారు తిరిగి మరల దప్పిగొనరు. అది మీ ఆత్మకు పూర్తి సంతృప్తినిచ్చును. ప్రియ స్నేహితా చివరగా మీకు ఒక మాట చెప్పదలిచాను, ఏమనగా మీరు కూడా సమరయ స్త్రీ వలె జీవజలములను అడుగుడి, అది మీ అంతరంగములోనున్న ఆత్మీయ దాహమును తీర్చును. అంతేగాకుండా అబద్దపు మతములు, తెగలు లేక బోధనల వైపు మీ దృష్టిని మరల్చుకొనకుడి, కారణం అవి మీలో అత్యున్నత తృష్ణను రేకెత్తించి చివరకు మిమ్ములను పొడిబారిన వారిగా మిగిల్చివేయును.

యోహాను 4:10, 13-14
10.అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. 13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

చివరగా యేసు మిమ్ములను ఆహ్వానించుచున్నాడు
మత్తయి 11:28-30
28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

Ritual cleansing and purification

Leave a Reply