Archive for the ‘తెలుగు-Telugu’ Category

సాంప్రదాయ శుద్ధీకరణ మరియు పవిత్రత

Monday, December 15th, 2014

ప్రపంచపు అనేక మత సాంప్రదాయ వాదులు ఏదో ఒక విధమైన శుద్ధీకరణ ప్రక్రియను కలిగియుంటారు. అది శిశు జననం కావచ్చు లేక మరణం కావచ్చు, అంతేకాదు వారి దైనందిన జీవితంలో విరేచనాలు, లైంగిక సంపర్కం అలాగే నెలసరి ఋతుక్రమం మరియు స్పృహతప్పుట మరియు రక్తం చిమ్ముట, ధాతువు విసర్జన సమయంలో వాంతులు వంటి వ్యాధులు సంభవించినప్పుడు శుద్ధి క్రమమును అనుసరింతురు, కొందరైతే తమ శరీరమును పూర్తిగా నీటిలో ముంచి స్నానము చేయుట ద్వారా శుద్ధి చేయబడుదురు.

యూదులైతే తమ చేతులు కడుగుకొనుట మరియు మిక్వా ద్వారా ఈ శుద్ధీకరణ అభ్యసింతురు, అదే ముస్లింలు దీనిని ఘుసి మరియు వుడు అందురు. హైదవులు పవిత్ర నదియైన గంగలో స్నానం చేయుట మరియు అచమన మరియు పుణ్యహవచనములు అభ్యసింతురు. అలాగే షింతోయులు మిసోగి మరియు స్థానిక అమెరికన్ ఇండియన్స్ వారు చెమటను కార్చుట ద్వారా శుధ్ధిని ఆచరింతురు.

వివిధ మతాలవారు వారి శుద్ధీకరణ విషయంలో తమ వ్యక్తిగత అభిప్రాయాలలో భేధములు కలిగి యున్నప్పటికీ, వీరిందరి మధ్య ఒక విధమైన సాన్నిహిత్యాన్ని చూడగలం, అదేమనగా వారి శుద్ధీకరణ నిమిత్తం వీరిలో అధిక శాతం ప్రజలు నీటిని శుద్ధీకరించే మూల కారకంగా స్వీకరిస్తారు. ఈప్రపంచములో గల ఇతర వస్తువులను తనలో ఇమిడించుకునే శక్తిని కలిగియున్న నీటిని వీరు వివిధ విధములగా వినియోగిస్తుంటారు.

ఈ విధముగా ఎవరికి వారు తమ మతాచారముల చొప్పున తమ స్వకీయ ఆలోచనలచొప్పున వారి పద్ధతులను ఏర్పరచుకొనురి. దీనిని బట్టి ఒక పురాతనమైన నానుడి, “శుద్ధుడగుట దైవత్వమునకు సాదృశ్యము” ప్రచురణలోకి వచ్చెను. ఇట్టి పరిశుద్ధత యొక్క సాంద్రత కొద్ది కాలము మాత్రమే నిలిచి ఉంటుంది, తద్వారా వారు మరలా మరలా అవసరమగుచున్నదంటే, దాని అర్ధం దీని శుద్ధీకరణ శక్తి లోపభూయిష్టమైనదని గోచరమగుచున్నది. తద్వార మనం ఆ కలుషితమును సమూలముగా శుద్ధీకరించే సామర్ధ్యం గల శక్తి యొక్క ఆవశ్యకత పూర్తిగా కనిపిస్తుంది.

నిజమే, మన భాహ్య శరీరమును కడిగి శుద్ధీకరించుట వలన, శరీరమునకు మేలు కలుగుతుందేమో గాని, అంతరంగిత విషయంలో మన బాహ్య శుద్ధి వలన ఏ విధమైన మేలు చేకూరదు. అలాగే, మన అనిత్యమైన శరీరముతో మన నిత్యమైన శరీరమును శుధ్ధీకరించజాలము. ఎందుకనగా, అనిత్యమైనది నిత్యమైన వాటిని చేరుకోజాలదు.

యేసు ప్రభువు తన యూదా మతమునకు చెందిన శిష్యులనుద్దేశించి ఇటువంటి కొన్ని ఆచారాములను బోధించాడు. మత్తయి 15:1-2,11,17-20
1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి. 11 నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదుగాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 17నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 18నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 19 దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

మనుష్యుల ఇట్టి చెడుతనము కాకుండా మరి కొన్ని తప్పిదములు మరియు దోషముల మూలంగా చేటుచేసుకొనే నీతి విషయమైన వైఫల్యముల ద్వారా వాటిని ఏవిధంగా తొలగించగలమో గుర్తించే శక్తి మరియు లోతైన సంగతులను తెలుసుకోవలసిన ఆవశ్యకత కలదు. ఇది షేక్సిపీయర్ రచించిన లేడి మెక్ పెత్ పలికిన మాటలు – మిక్కిలి చెడ్డ మచ్చ తొలగిపోవు గాక, ఎందుకనగా రాజైన డంకన్ మరణసంబంధ పాప విషయంలో తన చేతులు కడుగుకొనదలచెను.

ఈవిధమైన సాంప్రదాక పద్ధతులను నిర్వహించి తమను తాము కడుగుకొనుట ద్వారా వీరు ఒక విధముగా తమ పాపములను ఒప్పుకొనుచున్నారని తెలియుచున్నది. అంతే కాకుండా వారు తమ మానవీయ సామర్థ్యంతో, అగోచరముకాని వాటివియు మరియు నీతిని విడుచుటమాలంగా కలిగిన వైఫల్యతలపైన జయం పొందుటకు ప్రయత్నించుచున్నారు. జాగరూకత ఈవిధమైన ఆచారాలు జరిగించుటకు వీరిలో వాంఛగలదు. దైవభక్తి మరియు తీవ్రమైన కోరిక లేనివారైయుండి ఇట్టి పద్ధతుల ద్వారా తమనుతాను శుద్ధిచేసుకొనగలమని మరియు మానవీయ సామర్ధ్యంతో పశ్చాత్తాపపడుట వలన సామర్ధ్యమును తిరిగి పొందగలమని భావించుట వ్యర్థ ప్రయాసమగును. ఒకవేళ ఇట్టి చర్యల ద్వారా శుద్ధి పరచబడినప్పటికీ, హృదయమనే అంతరాత్మ మరియు మనస్సుపైన పచ్చబొట్టువలె ముద్రింపబడిన జన్మకర్మ పాపముల మరకలను మరియు ఆత్మీయ మరణము నుండి ఇట్ఠి శుద్ధీకరణ ప్రక్రియ కాపాడగలదా!

చివరిగా ప్రతి మనుష్యునిలోను అంతరిధ్రియము తెలియజేయునదేమనగా, మనం పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వం కోల్పోయియున్నామని తెలుసుకొనుచున్నాము. ఈ సమస్యను పరిష్కరించుకొనిన వారు భవిష్యత్తులో తీర్పునకు అప్పజెప్పబడుదురని తెలుసుకొనవలసియున్నది.

రోమీయులకు వ్రాసిన పత్రిక 2: 14-16
14 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు 16 దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

మానవాళి ఈవిధమైన వత్తిడిని ఎదుర్కొనుటకు తనకనుకూలమైన సామర్ లేని సిద్ధాంతాలతో కూడిన మతాచారాముల ద్వారా ఒక ప్రతిష్టాత్మక మార్గమును కనుగొనాలనే మంట రగిలించుకున్నది. అది తన ప్రయణ మార్గంలో వెలుగు ప్రధాత కాదలదని భావిస్తునప్పటికీ, మన వ్యక్తిగత కోర్కెలను విడిచిపెట్టాలనే విషయాన్ని నాస్తికత్వం పూర్తిగా నిరాకరిస్తుంది. కాబట్టి వారికి గమ్యం అంటూ ఏమి ఉండదు. ఎందుకనగా కాస్త మానసికంగా బలహీనులైన వారిని ఈమతాచారము భావుకతకు లోనగునట్లు చేసి తద్వార తాము ఆశించిన స్థానంలోకి ప్రవేశం కల్పించు కల్పిత మార్గమాయెను. ఏలైగాతేనేమి సృష్టికర్త ఆశించిన విధముగా మానవుడు తనను తాను మందిరమునందు ముంగలిగాను లేక సర్దుబాటు స్థలంగాను మలచుకొనుటలో సిద్ధహస్తుడాయెను.

ఈ విషయమును గూర్చి నేనైతే, ఒక విషయమును తెలియజేయాలని ఆశిసిస్తున్నాను, అదేమనగా, ఇతర మతముల వివరణలు తెలియజేయువిధముగా, మానవులు దేవుని వెదకుచున్నట్లుగాకుండా, దేవుని క్రియలను ఒక వ్యక్తి చేయుటవలన దేవుని వద్దకు చేరుకోగలడు, ఐతే దేవుడే మానవులతో నమ్మకమైన సత్సంబంధం కలిగియుండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈవిషయమై మానవ వ్యక్తిగత బలం మరియు బలహీనతలకు తావులేదు. ఐతే దేవునితో సహవాసం కలిగి ఆయనను ఆరాధించడం ద్వారా దేవుడు మనకు తన కృపాబాహుళ్యతలను, పరిశుద్ధతను మరియు శుద్ధీకరణలను ఉచిత బహుమానములుగా అనుగ్రహించును, అది మనవలన కలుగదు.

తీతు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా గాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

రోమీ 6:23
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఎఫిస్సీ 2:8-9
8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. 9 అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

1యోహాను 1:7
7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా జేసెను.

1యోహాను 1:9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

మీరు క్రైస్తవ విశ్వాసం కూడా ఇతర మతములోవలె మతాచారముల వలె శుద్ధీకరణమను భాప్తిస్మము అను ప్రక్రియను కొనసాగించుచున్నదని వాదించవచ్చు. ఇది మారు మన్ససు లేని విశ్వాసులను సంఘంలో ప్రవేశం కల్పించుటకు ఒక ముఖ్య స్నానంగా భావించుటలో నేను మీతో ఏకీభవిస్తాను. విశ్వాసమునకు మూలం నిజమైన బాప్తిస్మము. ఇది ప్రధమికంగా బాహ్య గుర్తు లేక చిహ్నంగా పరిగణింపబడుచున్నది. అయితే ఇది నిజము యేసుని ప్రశస్తమైన మరియు విలువైన జీవము గల రక్తముతో కడుగబడి ప్రతి విశ్వాసి ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడని రూఢిపరచుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి మార్పునకు కారకులైన ద్రవం వలన కలిగిన రక్షణ చేకూరుస్తున్నాడు. ఇదేదో కేవలం ఉపజని మరియు ప్రాణ వాయువుల కలయికలైన ద్రవం వలన కలిగిన రక్షణ కాదు గాని, దానిని పోలిన క్రీస్తుయేసుని క్రియలు మరియు జీవజలమైన పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరియు హృదయంలో మార్పు చెందుతుంది. ఇది దేవుడు కానుకగా అనుగ్రహించినది. అలాగే మానవులు లోనుండి ఒక మనుష్యుని నూతన జననం గూర్చిన సాదృశ్యంలో గల పరలోక దేవుని శక్తిని సూచిస్తుంది. ఇది మానవ ప్రయత్నం లేక మతాచారముల వలన లభించినది కాదు గాని, దేవుడు తానే స్వయంగా మానవుని రూపంలో క్రీస్తుగా జన్మించి మనలకు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మను అనుగ్రహించెను. పునర్జన్మ కేవలం క్రీస్తు యేసుని క్రియలు మరియు ఆయన పంపిన పరిశుద్ధాత్ముడు తనను వెంబడించు వారిలో రక్షణ పట్ల విశ్వాసమును మరియు నమ్మకమును రేకెత్తించుచున్నాడు.

ఇశ్రాయేలీయుల భవష్యత్తు విడుదల గూర్చిన యథార్ధతను గూర్చి హెబ్రీ ప్రవక్తయైన యోహేజ్కేలుతో దేవుడు పలికించిన ప్రవచనమనులు .

యోహేజ్కేలు 36:25-27
25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. 26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. 27 ​నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.

పర్ణశాలల పండుగ లేక సుక్కోతు విందునాడు రబ్బీ యేసు ఈవిదంగా చెప్పాడు

యోహాను 7:37-39
37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. 38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39 తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

పురాతనమైన యూదా మతస్థులు, తమ ఆచార కర్మల ద్వారా దేవుని మహిమ పరచుటవలన అశాశ్వితమైన సంతృని పొందేవారని హెబ్రీ 10వ అధ్యాయంలో ఇవి కేవలం క్రీస్తు యేసుని సిలువ పైన దేవుని గొర్రెపిల్లాగ బలియాగముగా సమర్పింపబడుట ద్వారా లోకము పాపమునుండి విడుపించు వాటికి కేవలం ఛాయ వంటివిగా పరిగణింపబడుచున్నవని వ్రాయబడియున్నది. నేడు యూదులకు ప్రాయశ్చిత్తం యొక్క అవసరం లేదని చెప్పుట మరియు వారి ప్రార్ధన ఉపవాసములు మరియు మంచి క్రియలను ఆధారములను ఆచరించుట ద్వారా వారికి విమోచనము లభించుచున్నట్టైతే వారు తొరా, లేవీకాండము 17:11 నిరర్ధకమగును.
11రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

యెషయా 53వ అధ్యాయంలో తెలుపబడిన మెస్సయా ద్వారా దేవుని కృపను మరియు కనికరములు లేకుండా మీరు ఎన్ని విధములైన ఆచార వ్యవహారములు నెరపినప్పటికీ అవి ఖచ్చితముగా మన పాపములను క్షమించిగలవని రూఢీగా చెప్పగలమా?

అలాగే చాలా మంది ఇస్లాము స్నేహితులైతే యేసుని సిలువ మరణంను గూర్చి వేరు భావము కలిగియున్నారు. నిజముగా ఈలోకంలో మెస్సయా భాధింపపడుట వలన మరియు విసర్జించబడుటటలో దేవుడు మానవాళికి గొప్ప సంతోషమును దాచియుంచెను మరియు దేవుని మహిమలోనికి అనేకులను నడిపించుటకు సిలువ ఒక కారకమాయోను. హెబ్రీ 2:9-18, 12:2

jesusandjews.com/wordpress/2011/07/14/crucifixion-of-jesus-christ-and-islam/

పరలోకమందుకున్న దేవుడు మనలను ఈ నీటి యొద్దకు నడిపించినప్పటికీ వాటిని త్రాగుటకు వీలు కల్పించబడలేదు, కావున యేసు ఈ జీవ జలములను మీకు అనుగ్రహించుచున్నాడు. దానిని త్రాగిన వారు తిరిగి మరల దప్పిగొనరు. అది మీ ఆత్మకు పూర్తి సంతృప్తినిచ్చును. ప్రియ స్నేహితా చివరగా మీకు ఒక మాట చెప్పదలిచాను, ఏమనగా మీరు కూడా సమరయ స్త్రీ వలె జీవజలములను అడుగుడి, అది మీ అంతరంగములోనున్న ఆత్మీయ దాహమును తీర్చును. అంతేగాకుండా అబద్దపు మతములు, తెగలు లేక బోధనల వైపు మీ దృష్టిని మరల్చుకొనకుడి, కారణం అవి మీలో అత్యున్నత తృష్ణను రేకెత్తించి చివరకు మిమ్ములను పొడిబారిన వారిగా మిగిల్చివేయును.

యోహాను 4:10, 13-14
10.అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. 13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

చివరగా యేసు మిమ్ములను ఆహ్వానించుచున్నాడు
మత్తయి 11:28-30
28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

Ritual cleansing and purification

అద్వైతపు అవాస్తవికత

Monday, December 1st, 2014

అనేక స్థాయిలలో స్పష్టంగా, సమూలంగా మరియు ఆచరణాత్మకంగా అగోచరమైనదిగా మరియు తత్వపరంగా సరిపడనిదిగా లోపం కలిగిన దేవుని స్వభావానికి ఒక కచ్చితమైన ఆధ్యాత్మిక నిర్మాణాన్ని వివరించడం కన్నా ముగ్గురు సన్నిహిత స్నేహం కల సిపాయిలను “అందరి కోసం ఒక్కడు మరియు ఒక్కడి కోసం అందరు” అని వర్ణించినట్లు ఒక పాత నానుడి “సర్వమేదైవం, దైవమే సర్వం” అనే దానిని వర్ణించడం మరింత తీవ్రంగా అనిపిస్తుంది.

మొట్టమొదటగా అనంతరూపియైన దేవుడు అనంత రూపిగా కాక తన తత్వ స్వభావానికి విరుద్ధంగా పరిమిత రూపిగా విభజించబడి మార్చబడి వ్యక్తీకరించబడటం ఎలా సాధ్యం? ఇంకా దేవుని గురించిన సరియైన ఉద్దేశము నుండి దూరంగా ఈ భ్రమాత్మక మూర్ఖత్వపు స్థితిలోనికి తీసుకువచ్చి మనోవైకల్యపు అనైక్యత దిశగా నడిపించింది ఏమిటి?దేవుడు అఖండుడు కాక దాని కంటే తక్కువది ఏ స్థితిని కలిగియున్నా దేవుడు తప్పనిసరిగా అఖండుడు కానివాడు అవుతాడు.

ఇదే విధంగా ఒక “సంసార” అనే ఆవృత వ్యవస్థ దిశగా మళ్ళే సంభావ్యతతో మరొకసారి ఈ పొంతనలేనిది ఎప్పటికైనా తిరిగి ఐక్యపరచబడటం ఎంత పునఃనిర్ధారించేదిగా ఉంది? దీనికితోడు ప్రస్తుత జనాభా పెరుగుదలతో ఉనికి యొక్క ఈ తాత్కాలిక మరియు భ్రమాత్మక పదార్ధ రూపాలన్నీ ఒక సమూలమైన ఐక్య స్థితిలోనికి నాశనకారులుగా పయనిస్తున్నాయనడానికి ఋజువేముంది?

అద్వైత వాదానికి ఉన్న మరొక సందేహం ఏంటంటే దేవుని గురించిన సమూలమైన లేదా కచ్చితమైన భావన అనేది దేవుడు నీతికి అతీతుడు అయినా కనికరము కలవాడు, దేవుడుగా నీతియుక్తమైన జీవులుగా తన కార్యకలపాలను నిర్వర్తిస్తాడు అన్నట్టుగా వ్యక్తీకరించబడింది. ఇక్కడ కూడా ఈ అధిక స్థాయిలోని నీతిబాహ్య తత్వము నిమ్న స్థాయిలోని నీతి తత్వముగా ఎలా తనను తాను యిమిడ్చుకోగలుగుతుంది? అయినప్పటికీ హిందువులు ఇతరుల పట్ల ఉపకార భావనను కలిగి నడుచుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు, ఇది వారి అంతిమ నీతిబాహ్య తత్వానికి చేరుకోవడానికి భిన్నంగా ఉన్నట్లు ఇట్టే అర్థమవుతుంది. తప్పనిసరిగా వారి అద్వైత వాదం కాదు కానీ వారి క్రియలే నీతిబాహ్యత ప్రతిరూపంతో పోల్చినప్పుడు సంస్కృతి, నాగరికత మరియు సమాజపు మనుగడకు దోహదపడుతున్నాయి కావున విస్తారంగా వారి పరోపకార క్రియలే విలువైనవిగా వెల్లడిచేస్తున్నాయి. కావున నిర్వాణ లేదా మోక్షానికి చేరుకోవడానికి వారి సిద్ధాంతాన్ని ఒక మెట్టుగా స్థానం కల్పించడానికి మరియు వారి దైనందిన జీవితాన్ని ఎలా విలువనిచ్చి కొనసాగిస్తున్నారు అన్నదానికి పొంతనే లేదు. అంతేకాక ఈ నైతిక భేదాలు భ్రమాత్మకంగా మరియు మిధ్యాపరంగా అర్థరహితంగా ఉంటూ చివరకు వచ్చేసరికి ఏదో ఒక రకంగా వీరి పరోపకార క్రియలను అర్థవంతంగా లేదా నిరూపితాలుగా ఎంతవరకు చేయగలవు? ఇది సత్యదూరంగా ఉంటూ ఒక కనికట్టులా అనిపించడం లేదా? వాస్తవానికి అద్వైతవాదుల నమ్మకం ప్రకారం అడాల్ఫ్ హిట్లర్ చేసిన పనులను మరియు మదర్ థెరీసా చేసిన పనులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారిద్దరి పనుల మధ్య వాస్తవానికి తేడా ఏమీలేదు కావున. అలా వేరుగా చూస్తే దేవుడిని కించపరిచినట్లవుతుంది. నైతికంగా భంగపాటుకు లోనవుతూ ఏ అద్వైతవాది అలా ఊరక నిల్చుని నైతిక విలువలకు వెలుపల ఉండగలడు? ఇది తప్పు నుండి ఒప్పును వేరుపరుస్తున్నట్టుగా సార్వత్రిక న్యాయ వ్యవస్థ యొక్క వాస్తవికత వైపుగా ఇది మరలా ఒక నిబంధన అవుతుంది. ఒక స్నేహితుడు బహుమానము ఇవ్వడానికి మరియు ఆ బహుమానాన్ని ఒక దొంగ ఆ బహుమానాన్ని దొంగిలించడానికి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు అనడం పూర్తిగా అసత్యము మరియు అబద్ధము అవుతుంది. నైతిక సరిహద్దులు లేకుండా పరిపాలించబడే ఒక ప్రపంచాన్నిమరియు సమాజాన్ని మరియు అటువంటి అరాచక న్యాయరహిత స్థితిలో మీరు జీవించాల్సి రావడాన్ని మీరు ఊహించగలరా? వారు ఎప్పటికీ బయటపడలేని మరియు బయటపడకూడని ఒకదాని వలె మరియు హైందవ నమ్మకాల ప్రకారం తప్పు మరియు ఒప్పు/మంచి మరియు చెడుల యొక్క సార్వత్రిక సూత్రాలను భంగపరుస్తున్నవిగా అనైతికత యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడంలో నైతిక విలువలు ప్రాముఖ్యంగా సంబంధాన్ని కలిగి ఉంటాయని చూపించే ప్రాయశ్చిత్తము యొక్క్ కర్మా బలాలలో విశ్వాసముంచేటట్లుగా మరణ సమాధులను మించి మనుగడ కొనసాగించే సామాజిక ఒప్పుదల కొరకు నైతిక ప్రమాణాలను కలిగియుండటంలో వాస్తవమైనది మరియు ప్రాముఖ్యమైనది ఒకటుందని స్వభావసిద్ధంగానే ఒక అద్వైత వాదికి అర్థమవుతుంది. చివరగా ఈ సందర్భంలో హిందువులు అనైతికమైన వారని నేను అనడం లేదు కానీ ఒకవేళ వారు నమ్మే ఆ ప్రవర్తనే తప్పనిసరిగా అవాస్తవమై లేదా భ్రమాత్మకం అయితే దానికనుగుణంగా స్పందించడానికి మరియు అంతమ గమ్యానికి ఇదే ఒక తప్పనిసరి మార్గం అని చెప్పడానికి వారికొక ధృఢమైన ఆధారం లేదు. ఇది వారి జీవన విధానం ద్వారా తప్పుగా వ్యక్తీకరించబడింది. చివరిగా దేవుడు నీతిబాహ్యమైన వాడుగా ఒక వెర్రి అసాంఘీక వ్యక్తితో సమానంగా వ్యక్తపరచబడటం అవుతుంది.

మరొక విషయమేమిటంటే అద్వైత వాది A మరియు A కానిది రెండూ సమాన వాస్తవాలు కానీ వారి దైనందిన జీవితాలు మాత్రం ఈ నమ్మక వ్యవస్థతో అంగీకరించవు మరియు వాస్తవికత మరియు భ్రమల మధ్య వైవిధ్యం ఆధారంగా సత్యం మరియు అసత్యము ఏమిటి అనే ద్వైత సిద్ధాంతానికి మద్దతిచ్చే వారి అద్వైత సిద్ధాంతముతో కూడా వారి జీవిత విధానము సరిపోయేదిగా ఉండని కారణంతో “లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్”(అవివాద న్యాయము)హేతువును మరియు తర్కాన్ని తిరస్కరిస్తాడు. ఈ కనుగొనబడని సిద్ధాంతపు కొన్ని ఉదాహరణలలో అద్వైతవాదులు”ఒక వ్యక్తి అసలు ఉనికిని కలిగిలేడు” అనే వ్యాఖ్యలు ఉంటాయి, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి మొదటగా ఉనికిని కలిగి ఉండాల్సిందే.

ఒక కాల/ప్రదేశ నిడివిలో అసలైన అపరిమితములు ఉన్నాయని కూడా ఇది తెలుపుతుంది. ఇది కూడా కేవలం గణిత సూత్రాలలో మాత్రమే కనిపించే ఒక ఊహాభావనే. ఇంకా పరిమిత స్థితిలో దేవుడు అగోచరమైన వాడు అనే వారి వాదన తనను తానే ఓడించుకుంటూ జ్ఞానాన్ని ఒక పరిమిత జీవిగా వ్యక్తీకరిస్తూ సర్వజ్ఞాన కచ్చితమైన వ్యాఖ్యను చేస్తుంది. అదనంగా వారి స్వీయ సైద్ధాంతిక విశ్వాసల పట్ల ఒక అద్వైతవాది స్థిరంగా ఉంటే అది పరిమితమైన దానినుండి వెలువడే వారు చేసిన వ్యాఖ్యలను బట్టే వారిని సందేహములోనికి నెట్టి వేస్తుంది మరియు మనిషే దైవమై ఉంటాడనే ఆలోచనను వెలికితీసి ఎవరు తమ్మును తాము మోసపుచ్చుకోగలరు?
వారి దైనందిన జీవితాల క్రియల ద్వారా తప్పుగా నిర్ధారించబడేవిగా ఈ నమ్మకాలకు మద్దతు పలికే అసహజమైనదిగా మరియు ప్రత్యేకంగా ఒక నిర్ధారణ లేదా ప్రభావమైన వివరణ లేనిదిగా ఉంటూ ఈ పూర్తి తత్వ వ్యవస్థను ప్రాధమికంగా మరియు సాక్షాత్తూ గ్రాహ్యం కానిదని నేను బలంగా సందేహించే పరిమితులకు లోబడి మరియు మానవ గురువుల యొక్క మరియు పుస్తకాల వాటిలోని అంశాలలో ఉన్న అసత్యాలను బట్టి భ్రమాత్మక ఆలోచనకు వారు నిజంగా వారి స్వంత వ్యవస్థ యొక్క ఆలోచననే నమ్మలేరు.

ఈ భౌతిక ప్రపంచం అంతా మిధ్య అని చెప్పడానికి ఒక అద్వైత వాది వద్ద ఉన్న సాక్షాలేమిటి? సహజసిద్ధమైన వాస్తవికతు విరుద్ధంగా నిరూపించడానికి వారి వద్ద ఉన్న పరిశీలనాత్మక పద్ధతులు ఏమిటి? ఇంకా ఏ అద్వైత వాది తను రోడ్డును దాటేటప్పుడు రెండువైపులా చూసుకోకుండా వాహనాలు కేవలం వారు ఊహా రూపాలని మాత్రమే తలంచి రోడ్డును దాటగలరు? దీనిఫలితంగా ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ అయిన మ్యాట్రిక్స్ సైన్స్ ఫిక్షన్‌ను నమ్మడం కంటే భౌతిక వాస్తవికతను నమ్మడం మరింత సంభవనీయము అవుతుంది. వీటన్నిటికీ అదనంగా మనం ఒక కలలాంటి ఊహాప్రపంచంలో జీవిస్తున్నాము, ఇది నిజము కాదు కేవలం మిధ్యే అని చెప్పడము పూర్తిగా ఆలోచన రహితమైనది. ఈభ్రమలను గూర్చిన వివేచనారాహిత్యము దానిప్రతివాదాన్ని దానికంటే తక్కువగా సంభావ్యమైనదిగా మరియు నిలకడగలిగినదిగా చేయలేకపోయింది.

వారి తత్వవాదం యొక్క మరొక్క అవాస్తవమైన సంగతేంటంటే స్పృహ, చిత్తం, భావోద్వేగాలు మరియు జ్ఞానము వంటి వ్యక్తిగతాంశాలు భ్రమాత్మకమైనవి మరియు ఇవి దేవుడు సరళమైన స్వభావాన్ని గురించిన వాదనకు వ్యతిరేకమైనవి మరియు వాస్తవానికి ఒక వ్యక్తి కోమాలోకి వెళ్తేనే కానీ ఈ విధంగా ఉండటం కుదరదు. ఈవిధంగా దేవుడిని అధికంగా సరళపరచడం అనేది నేను ఇదివరకే ఇతర ఆర్టికల్స్‌లో రాసిన విధంగా రూపకల్పనలో ఉన్న సంక్లిష్టతలు, మూలాలు ఆధారంగా ఖగోళపరంగా మరియు వేదాంతపరమైన సాక్షాధారాల వెలుగులో అంతగా ఒప్పించలేకపోతుంది.

Atheist and Agnostic

ఒక రాయికో లేదా చెక్కకో దేవుడు సరిగ్గా అనుకూలమైన వాడు అని చెప్పడం ప్రాధమికంగా దేవత్వం వైపుగా శ్రేఢియొక్క జీవ పరిణామ కొలమానంపై మానవాళి ఇంకా వెనుకబడి ఉంది అని తేటతెల్లం చేస్తుంది. పునరవతారం దిశగా వెనుకకు వెళ్ళడం అంటే ఒకడు తనను తాను దేవునితో జతపరచుకోవడం అయి ఉండవచ్చు.

దళితులను నిమ్న వర్గానికి చెందిన వారుగా లెక్క కట్టే ఒక కుల వ్యవస్థతో వారి సమాజం యొక్క సభ్యుల మధ్య భేదాన్ని ఏర్పాటుచేస్తూ కొంతమంది హిందువులు ఇతరులను చూడటం కూడా ఈ మొత్తం దేవుడిని గురించిన భావనకు సంబంధించి విరుద్ధంగా ఉంటుంది. ఇంకా దేవుని యొక్క మరొక ప్రతినిధిని అగౌరవ పరచడం అంటే మనలను మనం అగౌరవపరచుకున్నట్టే.

హైందవ సమాజంలో ఉన్న మరొక విలువ ఏంటంటే “అన్ని మార్గాలు భగవంతుని వద్దకే చేర్చుతాయి” అనే విషయాన్ని ఓపికతో బోధించడమే. దీని గురించి నేను ఇదివరకే వేరొక బ్లాగ్‌లో వ్రాయడం జరిగింది మరియు కానీ ఒక హైందవ జాతీయుడు హింసాత్మకమైన మార్గంలో దూసుకొస్తున్న తత్వభావనలు మరియు మతవిశ్వాసాలపై ప్రతిస్పందించడం అనేది ఇతర విశ్వాస వ్యవస్థలపై బలవంతంగా దాడిచేసే వారి సంస్కృతికి ఒక కళంకంగా చూస్తూ ఉండటంతో వారు నిజానికి దీన్ని నమ్మరు లేదా అంగీకరించరు.

అన్ని మార్గాలు భగవంతుని వద్దకే చేర్చుతాయి

ముగింపులో అద్వైత వాదపు వాస్తవికత వైపుగా ఈ మొత్తం విశ్వాసం ఒక ఏకీకృత నిర్మాణంలోని ఒక మూస లోపల జీవితాన్నంతటినీ పట్టించడానికి ఒక సంస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నం వలె జీవన పోరాటాన్ని దాని బాధ, శ్రమ మరియు మరణములతో సహా ఏర్పాటుచేయడానికి చేస్తున్న ఒక రివర్స్ ఇంజనీరింగ్ ప్రక్రియలా కేవలం ఒక ఎండమావిలా ఉంటుంది.
అటువంటి భిన్నత్వాన్ని జీవితంలో వివరించడానికి చేసే ప్రయత్నం ఒక చదరపు పాత్రను వృత్తాకార రంధ్రములో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నము వలె ఉంటుంది కానీ అలా చేయడం సాధ్యపడదు. కావున తత్వపరంగా సరియైనది కాకుండా పురాతన కాలం నుండి ఉన్నవని అనడం అవాస్తవము. ఈ విధంగా వారిది కాని స్వభావాన్ని పైకి వ్యక్తపరిచే వారిని యేసుక్రీస్తు వేషధారులుగా ప్రస్తావించడం జరిగింది.

తిరిగి ఐక్యపరచబడతామనే ఒక స్పృహను ఇచ్చేదిగా జీవితపు విషాదాలు మరియు భేదాలతో కలసి నడవడానికి ఒక మార్గమే బహుశా ఈ అవాస్తవికత యొక్క పూర్తి విధానపు ఆలోచన. మీరు ఎంత నిజాయితీపరులైనప్పటికీ ఒకదాన్ని నమ్మడానికి లేదా ఆశించడానికి ఆ విషయానికి సంబంధించిన ఒక వాస్తవమైనదాన్నో అవాస్తవమైనదాన్నో చేయాల్సిన అవసరం లేదు.

గౌరవదాయకంగా విస్తారమైన హైందవ సమాజము వారి మతపరమైన ఆలోచనల ఆధారంగా చైతన్యం కలిగించడంలో చాలా ముందు స్థానంలో మరియు దాని సమ సమాజ సభ్యుల కృత్యముల పరంగా చూస్తే ప్రపంచంలోని అనేకమంది కుష్టురోగులను మరియు అంధులను కలిగియుండి అందుకు భిన్నంగా ఉండటాన్ని బట్టి ఇలాంటి వాడుకలు మరియు నమ్మకాలు మరింత చైతన్యవంతమైన పథములోనికి లేదా సమాజములోనికి నడిపించలేవని అర్థమవుతుంది.

చివరగా నేను జీవితానికి మరింత సంభావ్య వాస్తవికత నిర్వచనాన్ని వివరించడానికి బహుగా పరిశోధించబడి చారిత్రాత్మకంగా మరియు తత్వ పరంగా విశ్వసనీయమైనదిగా మరియు అద్దినట్టు సరిపోయే నిలకడను కలిగిన వ్యవస్థను కలిగిన ఒక బైబిల్ పరమైన ఆలోచనను నేను మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను.

శాశ్వతమైన మహనీయుడు, సర్వజ్ఞాని మరియు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మానవాళిని తన సృష్టిక్రమంలో శిఖరాగ్రంగా చేస్తూ అన్నినిజరూపాలను ప్రత్యేకంగా భౌతికమైన మరియు ఆత్మీయమైన నిజరూపాలను సృజించాడని బయలుపరుస్తూ బైబిల్ ఒక చక్కటి వివరణను అందిస్తుంది. మానవుడు దేవుని స్వరూపంలో తయారుచేయబడ్డాడు కానీ దేవునిగా కాదు. దేవుని లక్షణాలను పంచుకుంటూ నైతికతను, జ్ఞానాన్ని స్పృహగా కలిగియుండి స్వేచ్ఛను ఒక ఉచిత నైతిక కారకంగా కలిగియుండి మానవుడూ రూపొందించబడ్డాడు. కానీ ఇన్ని గొప్పలక్షణాలున్నప్పటికీ తన సృష్టికర్త పరిశుద్ధతకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి మానవాళికి మరియు దేవునికి మధ్య ఒక అంతరాన్ని ఏర్పరుస్తూ పాపభూయిష్టమైన స్వభావాన్ని అందుకున్నాడు. అయితే దీనంతటిలో ఒక మంచి వార్త ఏంటంటే సార్వభౌమాధికారపు శక్తిమంతుడుగా దేవుడు తాను వ్యక్తిగతంగా కనికరమును కలిగిన వాడుగా యేసును ఈలోకములోనికి పంపించాడు. మానవాళిని విడిపించడానికి తనను తాను అర్పిస్తూ తన విధేయత ద్వారా మానవాళిని తిరిగి దేవునితో ఐక్యపరచడానికి ఒక సంధిపరమైన విమోచనా కార్యము ద్వారా ఈ యేసు దేవుడిగా ఉండి కూడా రక్తమాంసములుగా మారి సిలువగా పిలువబడే మానవ శ్రమను అనుభవించాడు. ఈ న్యాయసమ్మతమైన కార్యము తన యందు విశ్వాసముంచే వారికి రక్షణను ఇవ్వడానికి ఒక క్రయధనముగా ఉంటూ దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచింది. దీనిద్వారా మనము క్షమించబడి దేవునితో సమాధానపరచబడి అంతిమ ఫలితమైన శాశ్వతమరణము నుండి తప్పించబడ్డాము. లేనట్లయితే ఎందరైతే మొదట మనము దేవునినుండి వేరుచేయబడటానికి కారణమైన ఆ శాపమును తొలగించివేసే ఈ కనికరముతో కూడిన త్యాగాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారో వారు ఆ శ్రమను మరియు బధను అనుభవిస్తారు. ఇది అంతా అక్షరాలు, పదాలు మరియు ఉద్దేశాల యొక్క మర్మంగా అనిపిస్తుంది కానీ మానవ మత సంబంధ స్వీయ ప్రయత్నాలు సత్క్రియలు మాత్రమే కాక కేవలం ఎందరు ఆయన నామము బట్టి పిలువబడతారో వారు తమ జీవితంలో పూర్తి విడుదలను పొందుకుని ఆ రాబోయే జీవితము మహిమయుక్తమైన పరలోకపు స్వాస్థ్యమును అనుభవిస్తుంది.

యోహను 8:36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

మత్తయి11:28-30
28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 
హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

The Illusion of Pantheism

 

 

Holman QuickSource Guide to Christian Apologetics, copyright 2006 by Doug Powell, ”Reprinted and used by permission.”

హైందవ మతంలోని అద్భుతాలు

Monday, December 1st, 2014

ప్రారంభించడానికి గానూ వారి నమ్మకాలలో ఎంతో నిజాయితీని కలిగియున్న అనేకమంది హిందువులు ఉన్నారు కానీ వారి నమ్మకాలకు సంబంధించిన వాటిని పొందుకునే విషయంలో మాత్రం వారు అసలైన సత్యము విషయానికి వచ్చినప్పుడు అంతే నిజాయితీగా తప్పుదానిని అనుసరిస్తున్నారని నేను భావిస్తున్నాను.
దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మొదటగా 1995 లో పాలను త్రాగే విషయంలో చోటుచేసుకుంది. ఇందులో ఒక వ్యక్తి తన కలలో ఒక వినాయక విగ్రహానికి పాలు పట్టిస్తున్నట్టుగా కలను కనడం ద్వారా అది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో అనేక మంది పాలను అర్పించడానికి దారితీసింది. ఇదే అద్భుతం వినాయక విగ్రహాల విషయంలోనే కాక మిగిలిన దేవతలన్నిటి విషయంలోను చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మొదటగా 1995 లో పాలను త్రాగే విషయంలో చోటుచేసుకుంది. ఇందులో ఒక వ్యక్తి తన కలలో ఒక వినాయక విగ్రహానికి పాలు పట్టిస్తున్నట్టుగా కలను కనడం ద్వారా అది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో అనేక మంది పాలను అర్పించడానికి దారితీసింది. ఇదే అద్భుతం వినాయక విగ్రహాల విషయంలోనే కాక మిగిలిన దేవతలన్నిటి విషయంలోను చోటుచేసుకుంది. ఈ రూఢిపరచే సాక్ష్యాలన్నీ ఉన్నప్పటికీ ఈ అద్భుతం ఒక అద్భుతంలా జరగలేదు కానీ భౌతికశాస్త్రం పరంగా పాలకు ఉన్న క్యాపిల్లర్ స్వభావంతో వాటిని విగ్రహాలు తాగుతున్నట్టు అనిపిస్తాయి కానీ వాస్తావానికి తాగవు.

ఈ సంఘటనకు సంబంధించి ఒక టెలివిజన్ కార్యక్రమాన్ని చూడటం నాకు జ్ఞాపకానికి వస్తుంది. ఇలాంటి అతీతమైన వాటిని చేదించడానికి కొంతమంది భారతీయులు కలిసి ఎలుక బొమ్మకి పాలు పెట్టినప్పుడు అది దానికోసం పెట్టిన పాలు మొత్తం త్రాగినట్లుగా ఆ టీ ప్రోగ్రామ్ ప్రసారం చేసింది. నేను దీన్ని గమనించినప్పుడు ఇది తప్పు అని నిరూపించబడుతున్నప్పుడు ఆ సమీపంలోని భారతీయుల ముఖము వాడిపోవడం చూశాను.
మంచితనమంతటిలో బహుశా ఇది అదివరకు ఏమి జరిగిందో తెలుసుకోకుండగానే కేవలం కల్మషం లేకుండా సులభంగా నిర్వహించబడింది. అటువంటి అద్భుతాలను ఆత్మీయ సత్యాలుగా ప్రచారంచేస్తూ ఉండే కొన్ని మతాలను గురించి జాగ్రత్తగా ఉండాలని ఇది ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక కావొచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మలను అవి దేవుని వద్ద నుండి వచ్చాయో లేదా మరెక్కడినుండి వచ్చాయో తెలుసుకోవడానికి ఆత్మలను పరీక్షించాలని బైబిల్ చెప్తుంది. మరియు ప్రతీ మతపరమైన అనుభవాన్ని వూరికే అంగీకరిస్తూ ఉండటం కంటే సంఘటనలను మరియు ప్రజలను పరిశీలించడానికి దారితీస్తుంది.

ఏది ఏమైనప్పటికీ నేను హైందవ్యం గురించి మరింత విశదీకరిస్తూ నా కొన్ని ఆర్టికల్స్‌లో వ్రాయడం జరుగింది అవి ఈ మతము యొక్క స్వభావాన్ని తెలియజేసేవిగా ఉంటాయని భావిస్తున్నాను.

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

Miracles in Hinduism

హైందవ్యం మరియు పునర్జన్మ

Monday, December 1st, 2014

అనేకమైన తూర్పు మతాలు మరణం తర్వాతి జీవితపు కర్మ ఫలాలను వివరించడానికి అంశీకరించేదే ఈ పునర్జన్మ సిద్ధాంతం. హైందవులు జీవితాన్ని జననం, మరణం, మరియు పునర్జన్మ అనే ఈ మూడింటిలో పునరావృతమయ్యేదానిగా చూస్తారు, దీనినే సంసారం అని పిలుస్తారు. మోక్షాన్ని లేదా ముక్తిని చేరాలానే తాపత్రయంతో ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన క్రియలకు ఫలితమే ఈ సంసారం. ఈ సంసారం నుండి రక్షించబడటమే మోక్షాన్ని పొందటం. కాబట్టి ఒక హిందువు సమూలమైన పూర్ణత్వాన్ని ఎప్పుడు పొందుకుంటడంటే ఒక పవిత్రరూప స్థితిని పొందుకోవడానికి “మనచుట్టూ జరిగేదే మరల పునరావృతమౌతుంది” అనే ఈ ఆవృత చక్రం నుండి బయటపడినప్పుడే.

ఈ ఉనికి యొక్క అంతిమ స్థితిని లేదా రక్షణను పొందుకోవడానికి కొన్ని పద్ధతుల్లో ఒకని ప్రాణమును లేదా ఆత్మను ఐహిక రాజ్యమునుండి విడిపించడానికి జ్ఞానము, భక్తి, మరియు క్రియలు అనే మూలకాల ఆధారంగా యోగా చేయడంలో ఉండే ఉత్కృష్టతలను అనుభవించాల్సి ఉంటుంది.

వారి మతపరమైన విశ్వాసాల యొక్క సాంస్కృతిక వ్యక్తీకరణగా ఈ విశ్వాసాన్ని అనేకమంది హత్తుకొని అనుసరిస్తున్నప్పటికీ ఈ విశ్వాస విధానాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఈ మరణం తర్వాతి జీవితంపై ఒక సరళమైన సమాచారంకోసం ప్రపంచాన్ని చుట్టి వచ్చిన కొందరు వ్యక్తులు మరియు వైద్యుల వద్ద తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా నేను ఇటీవలే మరణం తర్వాతి జీవితంపై ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను మరియు వారి పరిశోధన ప్రకారం ఈ తాత్కాలికమైన పునరావృతమయ్యే జీవితాల ద్వారా తీర్పు తీర్చబడే విధానాల ద్వారా కాకుండా మరణం తర్వాతి జీవితంపై గ్రంధస్తం చేయబడిన విధంగా ప్రజలు పరలోకపు లేదా నరకపు జీవితాన్ని అనుభవిస్తారని వెల్లడైంది

Is Hell Real?

ప్రారంభించడానికి గానూ హైందవ్యం, చెడుతనము యొక్క సమస్యను మరియు ఈ వాస్తవికత యొక్క పరిణామాలను గుర్తిస్తుందని నమ్ముతున్నాను కానీ ఇది ఎలా నియంత్రించబడుతుంది అనే దానిపై వారి భావనలు నేను ఇదివరకు ప్రస్తావించిన మరణపు అంచులమట్టుకు వెళ్ళిన వారి భావనలు మరియు గ్రంధస్తం చేయబడిన వారి భావనలు మారుతుంటాయి.

రోమా పత్రిక 1 మరియు 2వ అధ్యాయాలలో దేవుడు ఏవిధంగా మానవాళికి పాపము యొక్క మూల స్వభావం మరియు న్యాయము లేదా తీర్పు అంశాలను మనకు తెలియజేయడానికి తప్పు మరియు ఒప్పుల ఒక ఆధ్యాత్మిక బారోమీటర్‌గా మనలోని ప్రధాన చట్రములో బలంగా ఏర్పాటుచేయబడిన నైతిక దిక్సూచిని అనుగ్రహించాడో తెలియజేయబడుతుంది. ఈ జ్ఞానము సాధారణం మరియు ఇది మనలను మానవులనుగా చేసేది, ఇంకా ఈ స్వభావసిద్ధ జ్ఞానము యొక్క తత్ఫలిత ఆలోచనలను సరిచేయడంలో క్రైస్తవ విశ్వాసానికి హైందవ విశ్వాసానికి మధ్య భేదాన్ని కలుగజేసే నైతిక సంశయత యొక్క నిర్మాణము.

మానవుడు ఒకసారి మరణించి తీర్పును ఎదుర్కోవాలి అని బైబిల్ సమర్ధిస్తూ ఉండగా హైందవ్యం మాత్రం కోరుకున్న రూపంలోనికి త్వరలో లేదా కొద్ది ఆలస్యంగా చేరుకునే సంబంధపు రకాన్ని కారణమయ్యే మరియు ప్రభావితంచేసే ఒకని ఉనికి నూతన పరచబడే దిశగా ఆత్మ ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారుతుందని తెలియజేస్తుంది.

నేను మానవ జీవితము యొక్క పరిశుద్ధతతో భిన్నత్వాన్ని లేదా వైరుద్ధ్యాన్ని కలిగియున్నదని నేను భావిస్తున్న హైందవ పరమైన ఆలోచన విధానంతో గమనించిన కొన్ని సమస్యలేంటంటే వారు మానవుల కంటే అధికంగా కొన్ని చెట్లను లేదా జంతువులను గౌరవించడం. ఇక్కడ నేను తెలియజేసేదేంటంటే భారతదేశములో దాదాపు ఐదవ భాగం జనాభాను ఆక్రమించిన ప్రజలలో దళితులుగా ఎంచబడుతున్న వారు అంటరానివారుగా పరిగణించబడుతున్నారు.

కొన్ని సందర్భాలలో బానిసత్వంలా అనిపించే ఈ రకమైన జాత్యహంకారం భారత ప్రభుత్వంచే నిషేధించబడినప్పటికీ భారత సమాజంలోని హైందవులలో అనేకమందిచే పాఠించబడుతుంది.

వాస్తవానికి ఈ మతపరమైన అణగద్రొక్కుట ఈ రకమైన వారు తమ సంస్కృతిని యొక్క విజయాన్ని సమర్ధించడానికి నిర్వర్తించాల్సిన కొన్ని పనులను సేవకులుగా నిర్వర్తిస్తూ రాజకీయ మరియు సామాజిక నిర్మాణాలను నియంత్రించడానికి సహాయపడతారు. అందువలన ఈ నిమ్న కులస్థులపై ఈ అణగద్రొక్కే నిస్సహాయులుగా చేసే ప్రవర్తన ప్రభుత్వంచే ఒక తప్పనిసరి చెడుగుగా భరించబడుతుంది.

వీరు వారి పూర్వ కర్మ ఫలితం వలన ప్రస్తుత జీవితంలో ఇలాంటి నిమ్న స్థితిలో జన్మించారని వీరిని గూర్చి అనుకోవడం జరుగుతుంది. తద్వారానే వీరు ఈ అణగద్రొక్కబడుతున్న నివాసాన్ని కలిగియుంటున్నారు. అయినా సమాజంలో భాగమైన వీరి పట్ల వారి “అహింస” సిద్ధాంతాన్ని ఆషిమా అనే హైందవ తత్వము ఎలా నివారిస్తుందో నాకు అర్థం కావడం లేదు.

క్రైస్తవ మిషనరీలు దేవుడు అందరు మానవులకు అనుగ్రహించబడ్డాడు అని ప్రదర్శిస్తూ దళితులకు క్రీస్తు ప్రేమను ప్రకటించారు అయితే దుడుకు స్వాభావం కలిగిన హైందవులు దళితులను మరియు క్రైస్తవ మిషనరీలను ఇద్దరికీ హానిచేయడం ద్వారా ఆషిమాను విడిచిపెట్టడంలో చేస్తున్న కృషికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేశారు
ఇంతకీ వారు దేనిమీద తిరుగుబాటు చేస్తున్నారంటే వారి వ్యవస్థను అదుపు చేసుకోవడంలో వాఅరు కోల్పోయిన నియంత్రణనే. మరియు శాంతి కాముకులుగా అభివర్ణించే వారి మతపరమైన విశ్వాసానికి విరుద్ధంగా హింసకు భయానకానికి దిగడం జరిగింది.

కొందరు హిందువుల దృష్టిలో ఆషిమా అంటే మాంసాహారం నుండి మరియు బలులు నుండి దూరంగా ఉండటము. అయినా వారి హైందవ దేవుళ్ళను సంతృప్తి పరచడం కోసం ఈ నిమ్న జాతీయులుగా పిలువబడే వారిని బలివ్వడం అంగీకరయోగ్యమేనా?

మరొక వివాదాంశం ఏమిటంటే మానవ జీవితానికి అనంతమైన ప్రతిగమనం ఉందనుకోవడం. మరొకవైపు హైందవ విశ్వాసము పరిమితమైన భూమిని సమర్ధిస్తుంది. సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ అని పిలువబడే ఆరంభ దశ నుండి కారణమైన కొనసాగుచున్న విశ్వ వ్యాప్తిని టెలిస్కోపులతో గమనించడం ద్వారా ఒక పరిమిత విశ్వాన్ని సమర్ధించింది.

పరిమిత ప్రపంచంలో ఆత్మ మాత్రం అనంతము అని అనుకోవడం పూర్తిగా వివేచనా రాహిత్యంగా అనిపిస్తుంది.

కాబట్టి అపారత్వానికి సమకలనము జీవితం అయితే మొదటి మానవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు మరియు ఆ మనుష్యుడు ఇదివరకే ఉనికిని కలిగి ఉండకపోతే ఈ కర్మరాజ్యంలో ప్రస్తుతం ఎలా పాల్గొంటున్నాడు? మరొక విధంగా చెప్పాలంటే ఒకవేళ అసలు ఉనికిని కలిగిలేని దాని నుండి కలిగిన చర్యల ద్వారా మొదటి పుట్టుక ఎలా ఆవశ్యమవుతుంది? దేవుడు కూడా ఏదో ఒక విధంగా బిగ్ బ్యాంగ్‌కు లోనై ఇప్పుడు మనము మోక్షం కోసం చేసే ప్రయత్నాల ద్వారా ముక్కలైపోయిన ఆయన్ను అతికించాలా?

కాబట్టి ఒకవేళ సాక్ష్యము కాలపు ప్రారంభ బిందువు వద్దకు తీసుకెళ్తే జీవితం ఎలా ప్రారంభమైంది మరియు మన జన్మము అనేది పూర్వ జన్మ కర్మను అనుసరించేది అయితే మొదటి పుట్టుక ఎలా సంభవించింది?

కర్మ సిద్ధాంతానికి సంబంధించిన మరొక విషయం ఏంటంటే మీకు తెలియకుండా మీరు పూర్వ జన్మలో చేసిన కృత్యాలకు మీరు బాధ్యులు ఎలా కాగలరు మరియు మీరు వచ్చే జన్మలో మీరనుకున్న దాన్ని సాధించడానికి సరిపడ క్రియలు ఈ జన్మలో చేశారో లేదో మీకెలా తెలుస్తుంది? ఒకడు ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో మరియు చివరగ ఒకడు ఎక్కడ తన జీవితాఅన్ని ముగిస్తాడో ఎవరికి తెలుసు?ఇది కేవలం ఒక వ్యక్తిని అచేతనావస్థ లోనికి లేదా నిస్సహాయ స్థితిలోనికి తీసుకువెళ్తుంది. చివరలో మోక్షము యొక్క సంక్లిష్టమైన మూలకాన్ని పొందుకోవడంలో ఒక నిర్ణయాత్మకమైన ప్రణాలిక లేకుండగానే ఒక వ్యక్తి విడువబడతాడు.
వచ్చేజన్మలో నిమ్న జీవిత రూపాలుగా అంటే పురుగులుగా మరియు జంతువులుగా జన్మించాల్సి వచ్చే యోగా చేసే సామర్ధ్యము లేని వారి నిస్సహాయ స్థితి సంగతేమిటి? లేదంటే వారి భవిష్యత్ జీవితాన్ని ఒక చుంచెలుకగా చింతించుచున్న వారికి ఉన్న నిరీక్షణ ఏమిటి?

అనేకమంది గురువులను కలిగియున్న భారత సంస్కృతి నిజంగా ఈ ప్రపంచానికంతటికీ ఒక ప్రకాశమానంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నట్లయితే చైతన్యవంతమైన సమాజం అనే తర్కం ఆధారంగా ఎందుకు మన దేశంలో కర్మపాపులు అధికంగా ఉన్నారు? అన్ని కుష్టు వ్యాధిరోగులలో మరియు ప్రపంచంలోని దాదాపు సగం మంది అంధులు ఈ విశ్వాసంలోనే నివసిస్తున్నారు.

చివరగా నాకేమనిపిస్తుందంటే వారి అంతిమ గమ్యానికి తీసుకువెళ్ళే గురువులద్వారా నడిపించబడుతున్న హిందువుల యొక్క గోవును పట్టుకుని వ్రేలాడే ఆరాధికుల భారాన్ని ఈ నమ్మకము యొక్క పగిలిపోయిన చక్రము సమర్ధించదని అనిపిస్తుంది.

ఇంకా ఎటువంటి కచ్చితమైన వాస్తవికతను కలిగిలేని ఒక తత్వాన్ని నమ్మేలా మనుష్యుని మోసంచేయడానికి ఈ విధానం అంతా ఒక మాయ లేదా ఎడారిలో ఎండమావి వంటిది అవ్వవచ్చు.

చివరిగా నేను కొన్ని కఠినమైన సంగతులను తెలియజేశానని నాకు తెలుసు కానీ నేను నా హైందవ స్నేహితుల వద్ద అగౌరవపరచబడకుండా ఉండాలని కోరుకుంటూ నేను వారిని ఆలోచించకుండా చేస్తున్న విశ్వాసపు సాంస్కృతిక సరిహద్దులను దాటి ఆలోచించాలని కోరుతున్నాను. మరొక్కసారి ఈ పోస్ట్ ద్వారా నేను ఎవరినైన కించపరిచి ఉంటే మన్నించండి. ఎందుకంటే కించపరుస్తున్నట్టుగా లేకుండా ఒకరిని సవాలు చేయడం ఎప్పటికీ సులభం కాదు. మీ నమ్మకాలకు సంబంధించి సత్య ఆరోపణల చెల్లుబాటులను గురించి ఆలోచించడానికి ఒక క్షణం సమయం వెచ్చించాలని కోరుతున్నాను.

ముగింపుగా యేసు అందరికీ ఒక నిరీక్షణను అనుగ్రహిస్తున్నడని నమ్ముచున్నాను. అయితే ఈ నిరీక్షణ మతపరమైన “చెయ్యాల్సినవి” మరియు “చెయ్యకూడనివి” వంటి వాటిని పాఠించడంలో చూపే ప్రయత్నం ద్వారా కాకుండా కేవలం మిమ్మును మీ ఆత్మ యొక్క ఖాళీతనాన్ని మరియు ఖండించబడుతున్నమనసు యొక్క న్యూనత భావాన్ని విడిపించి ఆయనపై మరియు ఆయన పనిపై నమ్మకముంచడం ద్వారా మిమ్మును మారుమనస్సు అయిన నూతన జన్మలోనికి నడిపిస్తుంది.

మత్తయి సువార్త 11:28-30 ప్రకారం యేసు ఇలా చెప్పాడు 28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

Hinduism and Reincarnation

 

 

Copyright permission by Bridge-Logos “The School of Biblical Evangelism”

Copyright permission by Random House Inc./Multnomah on New Birth or Rebirth by Ravi Zacharias

హైందవ దేవుళ్ళు?

Saturday, November 29th, 2014

హైందవ మతంలోనే దేవుడు అన్న అంశంపై “అసలు దేవుడు లేడు” అన్న భావన నుంచి “ఒక్కడే దేవుడు” అనే భావన వరకు మరియు ఆపై “అనేకమంది దేవుళ్ళు”, “మూడు కోట్ల ముప్ఫై లక్షల మంది దేవుళ్ళు” ఉన్నారు అనే భావన వరకు విస్తృత పరిధిలో భావనలను కలిగి ఉండవచ్చు. దేవుళ్ళపై ఉన్న ఈ విభిన్న అభిప్రాయాలలోనే మోనిజం, అద్వైతం, పానెంథీయిజం మరియు ఎనిమిజం అనేవి ఉన్నాయి.

దేవుని వ్యక్తీకరణకు సంబంధించిన ఈ విశ్వాసాలను విశ్లేషించేటప్పుడు వీటిలో తర్క సమ్మతం కాని ప్రస్ఫుటంగా వివేచించదగిన విభేదము కనబడుతుంది. మతపరమైన ఆలోచనలను ఆధారం చేసికొని మాత్రమే కాకుండా హేతువాదంపై కేంద్రీకృతమై ఉన్నట్టుగా వాస్తవికత కొరకు నిరంతరాయ యోచనతో ఒక వ్యక్తి తన దైనందిన లౌకిక జీవనాన్ని ఎలా కొనసాగిస్తాడు అనే అంశంపై కూడా ఆధారపడి దేవుడు జీవించనివాడుగా మరియు పట్టజాలని వాడుగా వ్యక్తీకరించబడుతుండటంతో “A”వర్గము వారు మరియు “A”వర్గము కాని వారు సమానంగా వాస్తవికతను మరియు కచ్చితత్వాన్ని కలిగివారుగా ఆలోచించే హైందవసమాజానికి అద్దినట్టు ఉండే లేదా అనుకూలంగా ఉండే అటువంటి విభిన్న ఉద్దేశాలను అంగీకరించడానికి విభేదము కనబడుతుంది.

అంతేకాక కొన్ని తెగల నమ్మకాల పౌరాణిక నేపధ్యానికి ప్రతిగా ఒక చారిత్రక ఆలోచనతో హైందవ దేవుళ్ళు ఏర్పాటుచేయబడ్డారు కాబట్టి ఈ భావన వారి పూర్వీకుల విశ్వాసాలను మరియు మూఢనమ్మకాల కథాక్రమాన్ని ఆధారం చేసుకుని ఉండటంతో ఈ హైందవ్యపు “దేవుని” ఆలోచన ఒక విలువైన తత్వముగా నిర్ధారించబడలేదు మరియు నిరూపించబడలేదు. మతపరమైన కల్పనా కథలు లేదా సాంప్రదాయాలు మినహా ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్కరూ అంతగా పట్టించుకోని పౌరాణిక గాధలు కలిగిన పురాతన మతాలైన ఈజిఫ్టియన్, గ్రీకు, రోమన్, మరియు జర్మనీ లేదా స్లేవిక్ నాగరికతలతో హైందవ్యాన్ని పోల్చినప్పుడు మాత్రమే ఈ భావన నిరూపితమవుతుంది..

ప్రజలను సాంప్రదాయ నాగరిక సాంఘీక ప్రపంచంలో అంతర్భాగమై ఉన్న కొన్ని అంతిమమైన మరియు శ్రేష్టమైన వాస్తవికతకు సంధానించేదిగా మరియు భయముతో కూడిన మర్మాధారమైన బాధ్యతవైపుకు ఇతరులను నడిపించే భావోద్వేగపూరిత శక్తిని ఈ దేవుని పురాణాలు కలిగి ఉంటాయి. ఇవి కాలక్రమంలో విశ్వసించలేనివిగా, కల్పితమైనవిగా మరియు భ్రాంతిదాయకంగా నిరూపించబడుతున్నప్పటికీ భారీస్థాయిలో ఒక వ్యక్తిపై, కుటుంబంపై, వంశముపై మరియు సమాజముపై వాటి ప్రభావాలు అధికారికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సమాజంలోని ప్రతీ అంశంలో బలంగా వేళ్ళూనుకుపోయి వ్యక్తిగత భద్రతకు ఒక తప్పనిసరి అంశంగా ఉన్న నాగరికత వారసత్వ సంపదలో బాగా భాగస్వామ్యాన్ని కలిగిన లేదా అనుబంధం ఏర్పడిన వారి వ్యక్తిగత గుర్తింపును ఒక మంద వంటి ఆలోచన స్వభావం కల వారిని వేరే విశ్వాసాన్ని నమ్మేలా చేయడం దాదాపుగా అసాధ్యంగా కనబడుతున్న అనేక కారకాల ఆధారంగా ఈ విశ్వాసాలన్నీ ఈరోజుల్లో కూడా ఎందుకు మనుగడ సాధిస్తున్నాయి లేదా ఉనికిని కలిగియున్నాయి అనేది ఆధారపడిఉంది. క్రీడా బృందాలలో మరియు రాజకీయ పార్టీలలో మనము దీనికి సంబంధించిన సాధారణ ఉదాహరణలను కనుగొంటాము. ఇందులోని సభ్యులు ఎలాంటి పరిస్థితిలో అయినా వారి బృందానికి లేదా పార్టీకి నమ్మకంతో అంకితభావంతో కట్టుబడి ఉంటారు. నాజిజం యొక్క అకృత్యాలను చూస్తే వారి ఆలోచనా విధానంతో మొత్తం నాగరికతలు మరియు సమాజాలు వంచనకు గురౌతాయో బాహాటంగా స్పష్టమైంది. కావున శాస్త్రీయంగా ప్రతీయొక్కరు తప్పు అవ్వడానికి మరియు ఏ ఒక్కరూ పూర్తిగా ఒప్పు కాకపోవడానికి అవకాశం ఉంది.

వారు స్వాంతన చేసికొని విలువనిచ్చే దేవునిపై వారికున్న ఉద్దేశము కేవలం ఒక మిధ్య అయి ఉండవచ్చనే విషయాన్ని ఆలోచించడం కూడా అనేకమందికి అసాధ్యంగా ఉంటుంది. కావున దీనికి విభిన్నమైన ప్రతివాదనలను, మరి ముఖ్యంగా వారు గౌరవించి మర్యాదగా చూసే ఇతరులు ఈ ప్రతివాదనను నిర్ధారించినప్పుడు దీనికి ఎటువంటి ఒక కచ్చితమైన అవగాహనకు రాకుండా తప్పించడం జరుగుతుంది. కానీ అన్ని విషయాలకు కొలమానంగా ఉండటానికి సాంస్కృతిక సరిహద్దులకు, సాంఘీక నిబంధనలు మరియు ప్రజాదరణలకు తావివ్వకుండా ఒకవేళ అది ముమ్మును మీరిప్పటివరకు అనుసరించిన మార్గము కాక మీ జీవితంలో మరో విభిన్న మార్గంగుండా తీసుకెళ్ళేది అయినా సత్యాన్ని అనుసరించాలనేది నా హిందూ స్నేహితుల పట్ల నాకున్న శ్రద్ధతో కూడిన ఆలోచన. మరియు ఒంటరిగా ప్రయాణించాల్సొచ్చినప్పటికీ అది మిమ్ములను ఏ గమ్యానికి చేర్చుతుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో అన్నదాంతో నిమిత్తం లేకుండా సత్యాన్ని అనుసరించడానికి దేనినీ మిమ్మును నిరుత్సాహపరచనీయవద్దు. లేదంటే నాశనము దిశగా అనేకమంది అధికంగా ప్రయాణించిన తప్పుడు దిశలో మీరుకూడా ప్రయాణించి మీ జీవితాన్ని అంతము చేసుకుంటారు.

మత్తయి 7:13-14

13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14 ​జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే..

చివరిగా ఈ కథనంలో నేను నేరుగా ప్రస్తావించిన అంశాలతో మరియు నిజాయితీతో మిమ్మల్ని బాధపరచలేదని నేను భావిస్తున్నాను. ఎంతో పవిత్ర ఉద్దేశంతో మరియు భక్తి భావంతో ఈ నమ్మకాలను అనేకమంది పాఠిస్తున్నారు మరియు ఎంతో తపనను కలిగి నిజాయితీతో వీటిని కలిగియుంటున్నప్పటికీ మీ నిజాయితీని తప్పుడు దానిని అనుసరిస్తున్న కారణంతో నేను ఎంతో ప్రేమపూర్వకంగా నా హైందవ స్నేహితులను ప్రశ్నిస్తున్నాను.

ముగింపుగా నేను మిమ్మల్ని దేవుని గురించిన ఒక సందేహంతో వదిలిపెట్టాలను భావించడం లేదు కానీ మన ఆత్మీయ భారములను తన భుజస్కంధాలపై మోసే ఒకరి వద్ద విశ్రాంతి పొందుటకు మిమ్మును ఆహ్వానించాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక!

మత్తయి 11:28-30 ప్రకారం యేసు ఇలా చెప్పాడు

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

 

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

god(s) of hinduism?

హిందూ(హైందవ) వనరులు

Saturday, November 29th, 2014

రవి జకర్యాస్ (పూర్వము ఒక హిందు)

www.rzim.org/resources.aspx

ఇది యేసును స్వీకరించిన ఒక సనాతన బ్రాహ్మణ వ్యక్తి యొక్క సాక్ష్యం

www.youtube.com/watch?v=UbToQCbZOOo

 

బైబిలు

 

నాలుగు ఆత్మీయ సూత్రాలు

 

యేసు సినిమా

అన్ని మార్గాలు దేవుని వద్దకే చేరుతాయి

Saturday, November 29th, 2014

దేవుడు ఒకే సారూప్యత మరియు సాధారణతను కలిగియుండి అన్ని మతాల తత్వాలు మరియు ఆచరణలు ఒకే వర్గం క్రిందకు వస్తాయని కొందరు అనుకుంటుంటారు. ఇంకా ఈ ఉపరితలం అతి విశ్వాసంతో నిండిన విభిన్న మతతత్వ ధోరణుల నీరు గుండా ఓడ నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ నిర్లక్ష్యం వైఖరి కేవలం మోసపూరితమైన విధ్వంసతో నిండిన ఒక మంచు కొండ యొక్క కొనను చూపుతుంది, ఐతే ఈ ఆబద్ద ఉపరితలం వారికాళ్ళ క్రిందనే ఉండి ఓడను ముంచేస్తున్న ఒక ప్రయాణికుడు ఎప్పటికీ సురక్షితమైన హారబరుకి చేరుకోలేక విచారిస్తూ ఉంటాడు, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, తప్పుడు సంకేతంతో నిండిన భద్రత భావన ఆ ప్రయాణికున్ని క్రిందకు లాగి పడేస్తుంది కాని అది ఎన్నటికీ నాశనంచేయబడదు.

చాలావరకు ఈ మతపరమైన వైశ్విక దృష్టికోణాలు అత్యంత విపరీతమైనవి మరియు విపరీతపరిణామాలు సృష్టంచేవిగా ఉండి, అంత సులభంగా గుర్తించగలిగేవి కావు కనుక అనేక మంది వాటిని గుర్తించడంలో విఫలమౌతూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క మతం/మతవిశ్వాసాలు తూలనాత్మకంగా ఒక సోనార్ పరిమిత వీక్షణ మరియు పరిధి గుండా ప్రమాదం సూచించే దాని నిజమైన ఆకారం మరియు రూపం చూసి వాటి గణణీయమైన తేడాలను ఎంచుకుంటూ చేసిన అధ్యయంలాగా ఈ రకమైన పరిజ్ఞానం లభిస్తుంది.

ఒక హిందూ/హైందవుడు ఈ రకమైన వైరుధ్యాన్ని వారి మతత్వంతో పొల్చినప్పుడు అంత సమస్యగా అనిపించడంలేదని అంటారు ఐతే రాడిల్ జాతీయవాద హిందువులు ఇతర మత ఉద్యమాల పట్ల విపరీతదోరణి కలిగియుండి తూర్పు గురువులు తరుచుగా పాశ్చాత్యులను వారి తత్వంవైపు మల్లించుటకు ఆసక్తి కనబరుస్తూ వారి దైనందిన జీవితంలో ప్రతిబింబించే సిద్ధాంతం మరియు భావజాలాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్తింపజేయడానికి ప్రయత్నిస్తుంటారు కాని చర్చకు దిగి రారు .

ఆచరణాత్మకంగా చెప్పాలంటే ఈఆలోచన మొత్తంగా బహుశ గతంతోని పోటీతత్వంతో నిండిన బహుదేవతా రాధన సమస్య పరిస్కార మార్గాన్వేషనకు మరియు ఈ మార్గాల మధ్య గల వ్యత్యాసాలకు వారధిగా ఈ ఆలోచన ఉండవచ్చు జీవిత రహదారి విస్తృతం కాబట్టి ఏదిఏమైనా ఈ కఠిన మనస్తత్వం సర్వమతాల నాయకత్వ శిఖరం నుండి క్రిందకు పడద్రోస్తుంది.

ఏమైనప్పటికీ కొందరు గ్రుడ్డివాని సాదృశ్యాన్ని ఉపయోగించడానికి పూనుకుంటారు మరియు ఏనుగు ఆలోచన దేవునికి సంబందించి ఉంటుంది కనుక దేవుడు అనే అంశం అందరి మధ్య సర్వసాధారణ అంశంగా ఉంటుంది కాని ఒక కఠిన మనస్తత్వంతో నిండిన మనిషి ఎల్లప్పుడు నిజాయితీ సహసంబంధ అంశంలోకి తీసుకురాలేడు.

ఎందుకంటే వివరించబడున్న దేవున్ని చూస్తున్నానన్న గ్రుడ్డివాని వాదనలు అతను అబద్దమాడుతున్నాడని గాని లేక మోసగిస్తున్నాడని గాని అర్ధంకాదు గాని ఈ రకమైన అంశీయవాదం ఒకని ప్రేరణామాత్మక అవగాహణ వాని స్వీయ ప్రయోజనాల ప్రబావం వివిధ కారణాల చేత తప్పుదోవ పట్టిస్తుంది ఒక మతపరమైన గురువు, స్వామి మరియు యోగి అనుసరిస్తున్న మార్గం ఆచరించతగినదిగా ఉండవచ్చు. ఐతే వారు నిజంగా దేవునితో సంబంధం కలిగియున్నారని ఏవరికి చెప్పడానికి వారి సొంత పోలికలో మరియు వారి విగ్రసంబంధమైన కోరికల కనుగుణంగా కనిపెట్టిన సృజనాత్మక మరియు ఊహాత్మక ప్రక్రియకు అనుగుణంగా దేవున్ని రూపొందించారు. యేసు ఈ అంశాల విషయమై హెచ్చరిస్తూ అబద్ద ప్రవక్తలు లేక గ్రుడ్డి గురువులు ఉంటారు వారు ఇద్దరూ త్రోవతప్పివారై ఉంటారు..

ఈ విషయమై బైబిలు ఏమి చెప్తుందో చూద్దాం

మత్తయి 24:24

24అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

రోమా 1:18-23

18దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 19 ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపర చెను. 20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. 21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. 22 వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

చివరగా దేవుని గూర్చిన అన్ని సిద్ధాంతాలు సమాన దృక్కోణంలో ఉన్నాయని మరియు ఏదీ సరైన దృష్టికోణం కాదని అభిప్రాయపడుతూ ప్రతి సిద్ధాంతాన్ని సమానంగా భావించినప్పటికీ అన్ని సిద్ధాంతాల పట్ల వారి దృష్టికోణం ఖండించేదిగా ఉంటుంది. అంతేగాకుండా ప్రతి వ్యక్తీకరణ హిందువుగా వారి విలువలు ప్రత్యేకమైన మరియు ఎంతో ప్రాముఖ్యమైనది ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తీకరణ ఒక అధికమొత్తం నుండి ఒక చిన్న లేశంగా ఉండి హిందూ అనే విలువ వారి ప్రత్యేకతను మరియు ప్రాముఖ్యతను ఎంచుకొని నడుస్తారు లేదంటే వారు ఇతర మతసంబంధమైన గుంపులు లేక ఇతర మతసంబంధకాని వారి దేవుని యొక్క ప్రత్యేక అనుభవాల వ్యక్తులు ఇందులో చేరడానికి వారికి ఏరకమైన అభ్యంతరాలు కనిపించబోవు. ఇంకా చెప్పాలంటే మనందరం కొంచెం సత్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాము, ఐతే వారు పొందిన ప్రోత్సాహం చివరికి మరియు అంతిమంగా వారు ఫలించడానికి తగినంత సమాచారం కలిగియన్నారు అదే ఖచ్చితమైన సత్యం.

అంతిమంగా వివిధ రకాలా నమ్మకాలు లేక వాటి సిధ్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయి లేక ప్రతి నమ్మకం ఒక సమానమైన విలువలను కలిగి ఉంటుందని నిరూపించబడింది. ఐతే మత సమన్వయం అనేది ఒక అంశం, అది సాపేక్షవాదం, ఏకతత్వవాదం మరియు సార్వత్రికవాదం ఇతరవాటిన్నింటికంటే వైరుధ్యాన్ని కనబరుస్తుంది. ఓర్పు అనేది మంచిదే కాని ప్రామాణిక సత్యాన్ని భర్తీ చేయలేదు మరియు దేవుని చేరడానికి అక్కడ అనేక మార్గాలు లేక అంగీకార యోగ్యమైన దారులున్నట్లు తెలియజేస్తుంది. ఐతే ఓర్పు అన్ని అంశాలకు ప్రామాణికం కాలేదు కాని, వాస్తవం ఏమిటంటే ఓర్పు మరియు ప్రేమ మాటలలో మాత్రమే కనిపిస్తుంది.

అంతిమంగా,బైబిలు ప్రకారం మాట్లాడితే రెండు మార్గాలు కలవు అవి ఒకదానికొకటి వైరుధ్యమైనవి. ఒకటి విశాలమైనది (అనేక) అది నాశనానికి తీసుకుపోతుంది, రెండవది ఇరుకు మార్గం (ఒకటి) అది నిత్యజీవానికి పోతుంది. మనందరికి నడవడానికి కాళ్ళు ఇవ్వబడ్డాయి అదేవిధంగా ప్రయాణించడానికి ఒక మార్గాం మరియు ఒక ఎంపిక కూడా ఇవ్వబడింది. అన్నీ మార్గాలను కలిపే విశాల మార్గాన్ని ఎన్నుకోవడమో లేక ధైర్యంగా నిత్యజీవానికి తీసుకెళ్ళే ఇరుకైన మార్గాన్ని కోరుకోవడమో అనేది నీకు ఒక సవాలుగా ఉంటుంది? యేసు చెప్పాడు నేనే మార్గం, సత్యం, జీవం నాద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రానేరడు.

చివరగా నీవు గ్రుడ్డిగా సత్యాన్ని తెలుసుకోమని దేవుడు నిన్ను వదిలివేయక ఆయనను తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ద్వారా నీ నేత్రాలను తెరచి ఆయనను నీపూర్ణహృదయంతో తెలుసుకొవడానికి అవకాశం కలుగుజేస్తాడు .

మత్తయి 11:28-30

28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

 

హిందూ(హైందవ) వనరులు

తెలుగు-Telugu

All Paths Lead to God